FTA: తుది దశలో భారత్‌-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు

భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాని (FTA)కి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని లండన్‌ లార్డ్‌ మేయర్‌ విన్సెంట్‌ కీవెని తెలిపారు....

Published : 25 Sep 2022 20:04 IST

లండన్‌: భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (FTA) సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని లండన్‌ లార్డ్‌ మేయర్‌ విన్సెంట్‌ కీవెని తెలిపారు. ఇంకా కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదరాల్సి ఉన్నప్పటికీ దీపావళి నాటికి ముసాయిదా సిద్ధమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతవారం ముంబయిలో జరిగిన ఫిన్‌టెక్‌ సదస్సులో పాల్గొన్న ఆయన తిరిగి యూకే చేరుకున్న అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. భారత్‌లో ఆయన ఆర్‌బీఐ, సెబీ ఉన్నతాధికారులతో పాటు పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు.

ఎఫ్‌టీఏ చర్చలు తుది దశలో ఉన్న సమయంలో భారత్‌లో పర్యటించడం సంతోషంగా ఉందని విన్సెంట్‌ అన్నారు. దీపావళి కల్లా ఒప్పందంపై సంతకం చేయాలనుకుంటున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో చెప్పినట్లు విన్సెంట్‌ వెల్లడించారు. ఈ ఒప్పందం ఖరారైతే.. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని తెలిపారు. గత ఏప్రిల్‌లో యూకే మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. దీపావళి కల్లా ఎఫ్‌టీఏపై సంతకం చేయడానికి మోదీ బ్రిటన్‌ పర్యటనకు వెళ్లాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే, ఈలోగా అక్కడ నాయకత్వ బదిలీ జరిగి లిజ్‌ ట్రస్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపావళి గడువునకు కొత్త ప్రధాని కట్టుబడి ఉంటారా లేక దాన్ని మరికొంతకాలం వాయిదా వేస్తారా? చూడాల్సి ఉంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts