వరుసగా రెండో రోజు.. తగ్గిన ఇంధన ధరలు!

దేశంలో వరుసగా రెండో రోజూ ఇంధన ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌పై 21పైసలు, డీజిల్‌పై 20 పైసలు తగ్గిస్తూ

Updated : 25 Mar 2021 14:35 IST

దిల్లీ: దేశంలో వరుసగా రెండో రోజూ ఇంధన ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌పై 21పైసలు, డీజిల్‌పై 20 పైసలు తగ్గిస్తూ నిర్ణయించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర నిన్న రూ.90.99 ఉండగా.. 21పైసలు తగ్గి రూ.90.78కి చేరింది. ఇక డీజిల్‌ ధర రూ.81.30 ఉండగా.. 20 పైసలు తగ్గి రూ.81.10 చేరింది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌,డీజిల్‌పై 22పైసలు చొప్పున తగ్గింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.39గా, డీజిల్‌ ధర రూ.88.45గా నమోదైంది. 

గత ఏడాది కాలంలో తొలిసారి దేశంలో ఇంధన ధరల్లో పెరుగుదలకు దేశీయ చమురు సంస్థలు బుధవారం విరామం పలికిన విషయం తెలిసిందే. నిన్న పెట్రోల్‌పై 18 పైసలు, డీజిల్‌పై 17పైసలు ఉపశమనం కల్పిస్తూ నిర్ణయించాయి. గతేడాది మార్చి 16 తర్వాత దేశంలో పెట్రో ధరలు బుధవారం తొలిసారి తగ్గించారు. ఏడాది కాలంలో ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. దేశంలో పెట్రోల్‌పై రూ.21.58, డీజిల్‌పై రూ.19.18 పెరగడం గమనార్హం. 

నగరం పెట్రోల్‌ ధర లీ. డీజిల్‌ ధర లీ.

దిల్లీ

రూ.90.78   రూ.81.10
చెన్నై రూ.92.77 రూ.86.10
బెంగళూరు రూ.93.82 రూ.85.99
ముంబయి రూ.97.19 రూ.88.20

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని