మరోసారి ఎగబాకిన ఇంధన ధరలు
దేశంలో ఇంధన ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. దేశీయ
దిల్లీ: దేశంలో ఇంధన ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. దేశీయ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 38పైసల వరకు పెంచాయి. ఇటీవల దేశంలో ఇంధన ధరలు వరుసగా 12 రోజులు పెరిగిన విషయం తెలిసిందే. ఆ వరుస పెరుగుదలకు రెండు రోజులు విరామం ఇచ్చి..అనంతరం ఈ రోజు మళ్లీ పెరగడం గమనార్హం. దిల్లీలో పెట్రోల్, డీజిల్‌పై 35పైసలు పెంచడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.90.93గా, డీజిల్ ధర రూ.81.32గా నమోదైంది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 36పైసలు, డీజిల్‌పై 38పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.54, డీజిల్ ధర రూ.88.69గా నమోదైంది. కాగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల జేబులు ఖాళీ చేయడంలో మోదీ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోందంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. ఇదిలా ఉండగా పెట్రో ధరల పెరుగుదలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి స్పందిస్తూ..‘పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలు అధిక లాభాల కోసం ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. ఆ కారణంగానే ఇంధన ధరలు పెరుగుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు. కాగా గత 54రోజుల్లో చమురు ధరలు 25సార్లు పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7.50పెరిగాయి.
నగరం | పెట్రోల్ ధర | డీజిల్ ధర |
దిల్లీ | రూ.90.93 | రూ.81.32 |
ముంబయి | రూ.97.34 | రూ.88.44 |
హైద్రాబాద్ | రూ.94.54 | రూ.88.69 |
బెంగళూరు | రూ.93.98 | రూ.86.21 |
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే