ఎనిమిదో రోజుపెరిగిన ఇంధన ధరలు

దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు

Published : 16 Feb 2021 09:35 IST

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల కారణంగా మంగళవారం భారత్‌లో మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పుంజుకున్నాయి. కాగా దేశంలో ఇంధన ధరలు పెరగడం వరుసగా ఇది ఎనిమిదో రోజు కావడం గమనార్హం. దేశరాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 30పైసలు పెరిగి రూ.89.29గా నమోదైంది. లీటర్‌ డీజిల్‌పై 35పైసలు పెరిగి రూ.79.70 వద్ద నిలిచింది. 

ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధరలు రికార్డు స్థాయిలో లీటర్‌ రూ.95.75గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.86.35 గా ఉంది. ఇక హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర గరిష్ఠ స్థాయిలో నమోదైంది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.84 ఉండగా.. డీజిల్‌ ధర రూ.86.93 గా నమోదైంది. కాగా ఇంధన ధరలు ఇలా అమాంతం పెరుగుతూ పోతుంటే సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు కురిపిస్తున్నాయి. 

నగరం పెట్రోల్‌ డీజిల్‌
దిల్లీ
  రూ.89.29
  రూ.79.70
ముంబయి
  రూ.95.75
  రూ.86.72
బెంగళూరు
  రూ.92.28
  రూ.84.49
హైదరాబాద్‌
  రూ.92.84
  రూ.86.93
చెన్నై
  రూ.91.45
  రూ.84.77

 

ఇదీచదవండి

ఐటీ నియామకాలు పెరుగుతాయి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని