Budget 2023: కేంద్ర బడ్జెట్‌.. తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇవే!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలుగురాష్ట్రాల్లోని పలు సంస్థలకు కేటాయింపులు చేశారు. సింగరేణి, విశాఖ స్టీల్ ప్లాంట్.. తదితర సంస్థలకు నిధులు కేటాయించారు.

Updated : 01 Feb 2023 15:57 IST

దిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌ (Budget 2023)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఆశాదీపం అని బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. మొత్తంగా చూసుకుంటే కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41, 338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు కేటాయింపులు ఇలా ఉన్నాయి..

ఏపీ సంస్థలకు కేటాయింపులు..

* ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీ - రూ. 47 కోట్లు

* పెట్రోలియం యూనివర్సిటీ  - రూ. 168 కోట్లు

* విశాఖ స్టీల్‌ ప్లాంట్‌          - రూ. 683 కోట్లు

తెలంగాణ సంస్థలకు కేటాయింపులు..

* సింగరేణి - రూ.1,650 కోట్లు

* ఐఐటీ హైదరాబాద్‌ - 300 కోట్లు

* మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు - రూ. 1,473 కోట్లు

తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి కేటాయింపులు..

* రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు - రూ. 37 కోట్లు

* మంగళగిరి, బిబినగర్‌ సహా దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు -  రూ. 6,835 కోట్లు

* సాలార్జంగ్‌ సహా అన్ని మ్యూజియాలకు - రూ. 357 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని