Star ratings for cars: భారత్‌లో వాహనాలకు స్టార్‌ రేటింగ్స్‌: నితిన్‌ గడ్కరీ

వినియోగదారులు అత్యంత భద్రతతో కూడిన వాహనాలను ఎంపిక చేసుకునేలా ‘భారత్‌ ఎన్‌సీఏపీ (Bharat New Car Assessment Programme)’ పేరిట కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari)వెల్లడించారు....

Updated : 24 Jun 2022 15:16 IST

దిల్లీ: వినియోగదారులు అత్యంత భద్రతతో కూడిన వాహనాలను ఎంపిక చేసుకునేలా ‘భారత్‌ ఎన్‌సీఏపీ (Bharat New Car Assessment Programme)’ పేరిట కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari)వెల్లడించారు. క్రాష్‌ టెస్టు (Crash Test)లు నిర్వహించి వాటి ఫలితాల ఆధారంగా వాహనాలకు స్టార్‌ రేటింగ్స్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫలితంగా వాహన పరికరాల తయారీ సంస్థల మధ్య కూడా ఆరోగ్యకర పోటీ నెలకొంటుందన్నారు. అలాగే కార్ల ఎగుమతుల పెరుగుదలకు కూడా ఈ కొత్త విధానం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్‌ క్రాష్‌ టెస్ట్‌లకు అనుగుణంగా భారత్‌ ఎన్‌సీఏపీ (Bharat NCAP) క్రాష్‌ టెస్ట్‌లు ఉంటాయన్నారు. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే భారత వాహనరంగం స్వయం సమృద్ధి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని