GAIL Share Buyback: షేర్ల బైబ్యాక్‌పై 31న గెయిల్‌ నిర్ణయం

ప్రభుత్వ రంగానికి చెందిన ‘గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌’ (GAIL) మరోసారి షేర్ల బైబ్యాక్‌కు యోచిస్తోంది. ఈ మేరకు మార్చి 31న జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది....

Published : 26 Mar 2022 21:31 IST

దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన ‘గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌’ (GAIL) మరోసారి షేర్ల బైబ్యాక్‌కు యోచిస్తోంది. ఈ మేరకు మార్చి 31న జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. మార్చితో ముగియనున్న త్రైమాసికంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం ఫలితాలకు కూడా బోర్డు అదేరోజు ఆమోదం తెలపనుంది. గెయిల్‌లో ప్రభుత్వానికి 51.80 శాతం వాటా ఉంది. ఒకవేళ బైబ్యాక్ చేపడితే ప్రభుత్వం కూడా అందులో పాల్గొననుంది. 2020-21లోనూ గెయిల్‌ షేర్లను బైబ్యాక్‌ చేసింది. అందుకు దాదాపు రూ.747 కోట్లు వెచ్చించింది.

మదుపర్లు లేదా షేర్‌హోల్డర్ల దగ్గరి నుంచి కంపెనీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తే దాన్ని షేర్ల బైబ్యాక్‌ లేదా షేర్ల రీపర్చేజ్‌ అంటారు. వాటాదార్లకు పన్ను భారం లేకుండా వారి పెట్టుబడిని తిరిగిచ్చేయడానికి కంపెనీకి ఇదొక మార్గం. అలాగే మార్కెట్లో అందుబాటులో ఉండే షేర్ల సంఖ్య తగ్గుతుంది. దీంతో డిమాండ్‌ పెరిగి కంపెనీ మార్కెట్‌ విలువ పెరిగే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు