Gas Cylinder Price: మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

సామాన్యుడిపై గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరుగుదల రూపంలో మరో భారం పడింది. 

Updated : 19 May 2022 12:38 IST

హైదరాబాద్‌: సామాన్యుడిపై గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరుగుదల రూపంలో మరో భారం పడింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. గ్యాస్‌ బండ ధరను రూ.3.50 పెంచారు. అలాగే వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.8 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 2019 సెప్టెంబర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ కమిషన్ పెరగని నేపథ్యంలో తాజాగా పెంచినట్లు వెల్లడించాయి. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల భారాన్ని మోస్తున్న సామన్యులపై తాజా పెరుగుదలతో మరింత భారం పడనుంది.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని