Gautam Adani: బిలియనీర్ల సూచీలో టాప్‌ 10 నుంచి అదానీ ఔట్‌..

అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్ల జాబితాలో టాప్‌-10 నుంచి బయటకొచ్చేశారు. ప్రస్తుతం ఆయన 11వ స్థానంలో ఉన్నారు. 

Published : 31 Jan 2023 13:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో టాప్‌-10 నుంచి బయటకు వచ్చేశారు. అదానీ గ్రూప్‌ అత్యధిక కంపెనీల షేర్లు వరసగా మూడు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి భారీగా పతనం కావడం దీనికి ప్రధాన కారణం. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో అదానీ సంపద 34 బిలియన్‌ డాలర్లు ఆవిరైపోయింది. ప్రస్తుతం ఆయన 84.4 బిలియన్‌ డాలర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాతి స్థానంలో 82.2 బిలియన్‌ డాలర్ల సంపదతో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కొనసాగుతున్నారు. ఇక అదానీ కంటే ముందు మెక్సికో సంపన్నుడు కార్లోస్‌ స్లిమ్‌ ఉన్నారు.

అదానీ గ్రూప్‌ షేర్ల విలువ మూడు రోజుల్లో భారీగా కుంగింది. ఈ క్రమంలో 68 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ ఆవిరైపోయింది. హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక ప్రభావంతో మార్కెట్లలో భయం నెలకొంది. నేడు కూడా ఉదయం 12 గంటల సమయంలో అదానీ టోటల్‌ గ్యాస్‌ షేరు 10 శాతం విలువ కోల్పోయింది. దీంతోపాటు అదానీ విల్మర్‌ 5 శాతం, అదానీ పవర్‌ లిమిటెడ్‌ 4.9 శాతం పతనం అయ్యాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ 0.6 శాతం కుంగింది.

నాలుగు ట్రేడింగ్‌ సెషన్లు కలిపి అదానీ టోటల్‌ గ్యాస్ విలువ 45 శాతం ఆవిరైపోయింది. ఇక గ్రీన్‌ ఎనర్జీ మార్కెట్‌ విలువ 38 శాతం, అదానీ టోటల్‌ ట్రాన్సమిషన్‌ 36.9 శాతం , పోర్ట్స్‌ 19.5 శాతం, అదానీ విల్మర్‌ 18 శాతం, అదానీ పవర్‌ 18.5 శాతం, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ 13 శాతం పతనం అయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు