Cooking oil: వంట నూనెల ధర లీటర్‌కు రూ.10 తగ్గించండి

దిగుమతి చేసుకున్న వంట నూనెల ధరలను వారం రోజుల్లోగా లీటర్‌కు రూ.10 వరకు తగ్గించాల్సిందిగా కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున, దేశీయంగా గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)ను తగ్గించాలని, దేశవ్యాప్తంగా....

Updated : 07 Jul 2022 08:40 IST

కంపెనీలకు ప్రభుత్వ ఆదేశం

దిల్లీ: దిగుమతి చేసుకున్న వంట నూనెల ధరలను వారం రోజుల్లోగా లీటర్‌కు రూ.10 వరకు తగ్గించాల్సిందిగా కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున, దేశీయంగా గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)ను తగ్గించాలని, దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్‌ నూనెకు ఒకే ఎంఆర్‌పీని పాటించాల్సిందిగా సూచించింది. ప్రస్తుతం దేశ వంట నూనె అవసరాల్లో 60 శాతానికి పైగా దిగుమతులే తీరుస్తున్నాయి. గత కొన్ని నెలల్లో అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా వంటనూనెల ధరలు ప్రియమయ్యాయి. మళ్లీ అంతర్జాతీయంగా వంటనూనెల ధరల్లో దిద్దుబాటు రావడంతో, స్థానికంగా ధరలు తగ్గించమని ప్రభుత్వం ఆదేశించింది. గత నెలలో నూనె ధరను లీటర్‌కు రూ.10-15 వరకు కంపెనీలు తగ్గించాయి. ప్రస్తుత ధోరణులపై వంటనూనెల సంఘాలు, ప్రధాన తయారీ కంపెనీలతో సమావేశమైన ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే, తగ్గిన ధరల ప్రయోజనాన్ని వినియోగదార్లకు బదలాయించాల్సిందిగా సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని