రెండో త్రైమాసిక అమ్మకాల్లో మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా రికార్డు

ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌లో మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మునుపెన్నడూ లేని స్థాయిలో   3,551 వాహనాలను విక్రయించింది. 2021 ఇదే త్రైమాసికంలో విక్రయించిన 1,664 వాహనాలతో పోలిస్తే ఈసారి రెట్టింపునకు పైగా పెరిగాయి. ఈ ఏడాది తొలి 6 నెలల్లో అ

Published : 12 Jul 2022 02:57 IST

దిల్లీ: ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌లో మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మునుపెన్నడూ లేని స్థాయిలో   3,551 వాహనాలను విక్రయించింది. 2021 ఇదే త్రైమాసికంలో విక్రయించిన 1,664 వాహనాలతో పోలిస్తే ఈసారి రెట్టింపునకు పైగా పెరిగాయి. ఈ ఏడాది తొలి 6 నెలల్లో అమ్మకాలు 56 శాతం వృద్ధితో 7,573  కు చేరాయి. 2021 తొలి ఆరు నెలల్లో సంస్థ 4,857 వాహనాలే విక్రయించింది. కొత్త మోడళ్ల విడుదల, ప్రస్తుత మోడళ్లకు గిరాకీ కొనసాగడం, సరికొత్త వ్యూహాలు అమ్మకాల్లో వృద్ధికి తోడ్పడ్డాయని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా తెలిపింది.


2030కి 50,000 విద్యుత్‌ బస్సులు: సీఈఎస్‌ఎల్‌

దిల్లీ: 2030 నాటికి దేశ రహదారులపైకి 50,000 విద్యుత్‌ బస్సులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థ కన్వెర్జన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) చర్చలు ప్రారంభించింది. ఇందుకు వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇండియా (డబ్ల్యూఆర్‌ఐ ఇండియా) తోడ్పాటు ఉంది. ఇటీవల విద్యుత్‌ బస్సులను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు తీసుకొచ్చిన గ్రాండ్‌ ఛాలెంజ్‌ విజయవంతమైందని సీఈఎస్‌ఎల్‌ తెలిపింది. గ్రాండ్‌ ఛాలెంజ్‌లో భాగంగా బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌, కోల్‌కతా, సూరత్‌ నగరాలకు 5,450 విద్యుత్‌ బస్సులను అందించడన్ని సీఈఎస్‌ఎల్‌ ప్రారôభించింది. ఈ టెండర్‌లో డీజిల్‌ బస్సుల కంటే 27 శాతం, సీఎన్‌జీ బస్సుల కంటే 23 శాతం తక్కువ ధరకే విద్యుత్‌ బస్సులు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని