కొత్త రేంజ్‌ రోవర్‌ డెలివరీలు ప్రారంభం

జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) తన కొత్త రేంజ్‌ రోవర్‌ కార్ల డెలివరీలను దేశంలో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆరు, ఎనిమిది సిలిండర్‌ పవర్‌ట్రైన్‌లతో వస్తున్న ఈ విలాసవంత కారు ధర రూ.2.38-3.43 కోట్లు(ఎక్స్‌ షోరూం)గా ఉంది. 3 లీటర్‌ పెట్రోలు, డీజిల్‌ ఇంజిన్‌లతో

Published : 12 Jul 2022 02:57 IST

దిల్లీ: జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) తన కొత్త రేంజ్‌ రోవర్‌ కార్ల డెలివరీలను దేశంలో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆరు, ఎనిమిది సిలిండర్‌ పవర్‌ట్రైన్‌లతో వస్తున్న ఈ విలాసవంత కారు ధర రూ.2.38-3.43 కోట్లు(ఎక్స్‌ షోరూం)గా ఉంది. 3 లీటర్‌ పెట్రోలు, డీజిల్‌ ఇంజిన్‌లతో పాటు 4 లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రైన్‌ మోడల్‌ కూడా ఉన్నట్లు జేఎల్‌ఆర్‌ ప్రెసిడెంట్‌, ఎండీ రోహిత్‌ సూచి సోమవారం పేర్కొన్నారు. 5, 7 సీట్ల వేరియంట్లతో ఉన్న కొత్త రేంజ్‌ రోవర్‌ దేశంలోని 21 నగరాల్లో లభ్యమవుతోంది.


దీపావళి కల్లా మరో 10 విక్రయ కేంద్రాలు

రూ.250- 300 కోట్ల పెట్టుబడి: కల్యాణ్‌ జువెలర్స్‌

ముంబయి: ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్‌ జువెలర్స్‌, దేశంలోని దక్షిణేతర విపణుల్లోనూ తన ఉనికిని బలోపేతం చేసుకునే యోచనలో ఉంది. దీపావళి కల్లా ఆయా ప్రాంతాల్లో కంపెనీ సొంతంగా 5, ఫ్రాంచైజీ పద్ధతిలో మరో 5 .. (మొత్తం 10) విక్రయ కేంద్రాలను ప్రారంభించేందుకు రూ.250- 300 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని కల్యాణ్‌ జువెలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ కల్యాణ రామన్‌ తెలిపారు. వీటిలో 3 దిల్లీ/ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో, మరో మూడింటిని ఉత్తర ప్రదేశ్‌లో, రెండింటిని మహారాష్ట్రలో; ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో ఒకటి చొప్పున ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కల్యాణ్‌ జువెలర్స్‌కు దేశవ్యాప్తంగా 127 విక్రయ కేంద్రాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని