హ్యుందాయ్‌ కొత్త టక్సన్‌

ప్రీమియం స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) టక్సన్‌లో సరికొత్త వెర్షన్‌ను హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా బుధవారం ఆవిష్కరించింది. ఈ నాలుగో తరం వాహనాలు పెట్రోల్‌, డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌లతో 6-స్పీడ్‌, 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్లతో రూపొందాయి.

Published : 14 Jul 2022 02:53 IST

వచ్చే నెలలో విపణిలోకి

దిల్లీ: ప్రీమియం స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) టక్సన్‌లో సరికొత్త వెర్షన్‌ను హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా బుధవారం ఆవిష్కరించింది. ఈ నాలుగో తరం వాహనాలు పెట్రోల్‌, డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌లతో 6-స్పీడ్‌, 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్లతో రూపొందాయి. 2-లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లు వరుసగా 156 పీఎస్‌, 186 పీఎస్‌ శక్తినిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ మోడళ్లను ఆగస్టులో విపణిలోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఎండీ, సీఈఓ ఉన్సూ కిమ్‌ వెల్లడించారు. కంపెనీ వాహనాల్లో గత ఏడాది అంతర్జాతీయంగా అత్యధికంగా (4.85 లక్షల మేర) అమ్ముడుపోయిన వాహనం ఇదేనని హ్యుందాయ్‌ తెలిపింది. ఈ మోడల్‌ తొలి తరం నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మంది వినియోగదార్ల హృదయాల్ని గెలుచుకుందని వెల్లడించింది. 125 నగరాల్లో కంపెనీకి ఉన్న 246 సిగ్నేచర్‌ విక్రయశాలల్లో ఈ మోడల్‌ను విక్రయిస్తామని వెల్లడించారు. ఈ నెట్‌వర్క్‌ ద్వారా  ఐ20 ఎన్‌ లైన్‌, అల్కజార్‌ మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని