నీట్‌ రాసే విద్యార్థినులకు ఓయో ప్రత్యేక రాయితీ

నీట్‌ 2022 పరీక్షకు హాజరయ్యే విద్యార్థినులకు ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్లు ఓయో ప్రకటించింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థినులు తమ హోటళ్లలో 60 శాతం వరకు రాయితీపై వసతి పొందొచ్చని వెల్లడించింది.

Published : 14 Jul 2022 02:54 IST

దిల్లీ: నీట్‌ 2022 పరీక్షకు హాజరయ్యే విద్యార్థినులకు ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్లు ఓయో ప్రకటించింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థినులు తమ హోటళ్లలో 60 శాతం వరకు రాయితీపై వసతి పొందొచ్చని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 497 నగరాల్లోని వివిధ కేంద్రాల్లో ఈనెల 17న నీట్‌ పరీక్ష జరగనుంది. 18 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. జులై 16, 17 తేదీల్లో ఈ రాయితీ పథకం అమల్లో ఉంటుందని ఓయో తెలిపింది. ఈ ఆఫర్‌ పొందేందుకు ఓయో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, పరీక్షా కేంద్రం సమీపంలోని హోటల్‌ను గుర్తించేందుకు ‘నియర్‌బై’ గుర్తుపై క్లిక్‌ చేయాలి. అనంతరం ‘నీట్‌జేఎఫ్‌’ కూపన్‌ కోడ్‌ను వినియోగించి హోటల్‌ గదిని బుక్‌ చేసుకోవాలని సంస్థ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని