Silver: వెండి సానుకూలమే!

పసిడి అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.51,860 ఎగువన సానుకూలంగా కనిపిస్తోంది. అందువల్ల ఈ స్థాయికి ఎగువన లాంగ్‌ పొజిషన్లు అట్టేపెట్టుకోవచ్చు.

Updated : 01 Aug 2022 03:31 IST

కమొడిటీస్‌ ఈ వారం

బంగారం  
పసిడి అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.51,860 ఎగువన సానుకూలంగా కనిపిస్తోంది. అందువల్ల ఈ స్థాయికి ఎగువన లాంగ్‌ పొజిషన్లు అట్టేపెట్టుకోవచ్చు. అయితే రూ.51,091 వద్ద స్టాప్‌లాస్‌ను పరిగణించాలి. ఒకవేళ కిందకు వస్తే రూ.50,890 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.50,154కి పడిపోయే అవకాశం ఉంది.

* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ ఆగస్టు కాంట్రాక్టు రూ.14,398 కంటే పైన కదలాడితే రూ.14,498; రూ.14,669 వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే రూ.13,998 వద్ద స్టాప్‌లాస్‌ను పరిగణించాలి.

వెండి
వెండి సెప్టెంబరు కాంట్రాక్టు సానుకూలంగానే కదలాడొచ్చు. రూ.55,764 కంటే దిగువకు రాకుంటే.. తొలి నిరోధ స్థాయైన రూ.60,540ను తాకే అవకాశం ఉంది. ఒకవేళ కిందకు వచ్చినా రూ.55,545 వద్ద మద్దతు లభించవచ్చు. దీనినీ కోల్పోతే రూ.52,713 వరకు పడిపోతుందని భావించవచ్చు.

ప్రాథమిక లోహాలు
*రాగి ఆగస్టు కాంట్రాక్టు రూ.649 కంటే పైన కదలాడితే మరింతగా రాణిస్తుంది. అందువల్ల రూ.631 వద్ద స్టాప్‌లాస్‌ పరిగణిస్తూ, రూ.646 కంటే పైన కొనుగోలు చేయడం మంచి వ్యూహమే అవుతుంది.
*సీసం ఆగస్టు కాంట్రాక్టు రూ.175.75 కంటే దిగువన ట్రేడయితే మరింత దిద్దుబాటు కావచ్చు. అయితే రూ.176 ఎగువన కాంట్రాక్టు బలంగా కనిపిస్తోంది.
*జింక్‌ ఆగస్టు కాంట్రాక్టు రూ.289 కంటే ఎగువన ఉన్నంతవరకు సానుకూల ధోరణి కొనసాగుతుంది. ఈ స్థాయికి సమీపంలో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవడం మంచిదే.
*అల్యూమినియం ఆగస్టు కాంట్రాక్టు రూ.209 కంటే కింద చలించకుంటే కొనుగోళ్ల మద్దతు లభించొచ్చు.

ఇంధన రంగం
8,437 వరకు పెరగొచ్చు.
సహజవాయువు ఆగస్టు కాంట్రాక్టు రూ.698 కంటే పైన కదలాడకుంటే అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం ఉంటుంది. అయితే రూ.601 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.586.50 వరకు పడిపోవచ్చు.
పసుపు ఆగస్టు కాంట్రాక్టు రూ.7,293 కంటే దిగువన కదలాడకుంటే.. రూ.7,946 వరకు పెరగొచ్చు.
జీలకర్ర ఆగస్టు కాంట్రాక్టు రూ.24,136 కంటే పైన చలిస్తే.. మరింత రాణిస్తుంది. అందువల్ల ఈ స్థాయికి దిగువన షార్ట్‌ సెల్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది.
ధనియాలు ఆగస్టు కాంట్రాక్టు రూ.11,604 కంటే దిగువన ట్రేడయితే.. మరింత దిద్దుబాటు కావచ్చు.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని