Airtel 5G: 5జీ సేవలు ఈ నెలలోనే ప్రారంభిస్తాం: ఎయిర్‌టెల్‌

5జీ సేవలను ఈ నెలలోనే ప్రారంభిస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ బుధవారం ప్రకటించింది. ఇందుకోసం ఎరిక్సన్‌, నోకియా, శామ్‌సంగ్‌ వంటి సంస్థలతో 5జీ నెట్‌వర్క్‌ ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడించింది. 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ముగిసిన 2 రోజులకే సునీల్‌ మిత్తల్‌ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌టెల్‌, సేవలపై తన నిర్ణయం ప్రకటించడం గమనార్హం.

Updated : 17 Sep 2022 14:19 IST

ఎరిక్సన్‌, నోకియా, శామ్‌సంగ్‌తో నెట్‌వర్క్‌ ఒప్పందాలు 

దిల్లీ: 5జీ సేవలను ఈ నెలలోనే ప్రారంభిస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ బుధవారం ప్రకటించింది. ఇందుకోసం ఎరిక్సన్‌, నోకియా, శామ్‌సంగ్‌ వంటి సంస్థలతో 5జీ నెట్‌వర్క్‌ ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడించింది. 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ముగిసిన 2 రోజులకే సునీల్‌ మిత్తల్‌ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌టెల్‌, సేవలపై తన నిర్ణయం ప్రకటించడం గమనార్హం. 900 - 1800 - 2,100 - 3,300 మెగాహెర్ట్జ్‌, 26 గిగాహెర్ట్జ్‌ బ్యాండ్లలో కలిపి మొత్తం 19,867.8 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను ఇటీవలి వేలంలో ఎయిర్‌టెల్‌ కొనుగోలు చేసింది. ఇందుకోసం సుమారు రూ.43,084 కోట్లు వెచ్చించింది. దేశీయంగా 5జీ విప్లవం ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నామని, ఆగస్టులోనే శ్రీకారం చుడతామని ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విత్తల్‌ వెల్లడించారు. వినియోగదార్లకు 5జీ కనెక్టివిటీ పూర్తి ప్రయోజనాలు అందించేందుకు వీలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ సాంకేతిక భాగస్వాములతో ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ ఒప్పందాలను పూర్తి చేసుకుందని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని