Updated : 06 Aug 2022 06:35 IST

Business news: కొత్త వాహనాలు కొలువుదీరాయ్‌

భారీ, మధ్య స్థాయి బస్సులను ప్రదర్శించిన అశోక్‌ లేలాండ్‌, టాటా, వీఈ కమర్షియల్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని అగ్రగామి వాణిజ్య వాహన సంస్థలు తయారు చేసిన అధునాతన బస్సులు, ఇతర తేలికపాటి రవాణా వాహనాలను శుక్రవారం ఇక్కడ ప్రదర్శించారు. టాటా, అశోక్‌ లేల్యాండ్‌, వీఈ కమర్షియల్‌ వెహికల్స్‌ సంస్థల నూతన శ్రేణి బస్సులను ‘ప్రవాస్‌ 3.0’ ప్రదర్శనలో ఆవిష్కరించారు. అశోక్‌ లేల్యాండ్‌, వినూత్నమైన 13.5 మీటర్ల పొడవైన బస్సు ఛాసిస్‌ను విడుదల చేసింది. రెండు నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాలకు ఇది అనువుగా ఉంటుందని సంస్థ వెల్లడించింది. ప్రస్తుత బస్సులతో పోలిస్తే 20 శాతం అధిక సామర్థ్యం (36 స్లీపర్‌ బెర్తులు) ఈ ఛాసిస్‌ ప్రత్యేకత. 248 హెచ్‌పీ ఏ4 ఇంజన్‌ వల్ల అధిక మైలీజీ, సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతాయని పేర్కొంది.

ఏడు రకాల టాటా వాహనాలు: టాటా మోటార్స్‌ ఏడు నూతన రవాణా వాహనాలను ప్రదర్శించింది. మాగ్న 13.5 మీటర్ల స్లీపర్‌ కోచ్‌, అల్ట్రా ఎలక్ట్రిక్‌ 8/9, స్టార్‌బస్‌ లాంగ్‌ రేంజ్‌ సీఎన్‌జీ, ఎల్‌పీఓ 10.2 సీఎన్‌జీ ఏసీ స్కూల్‌, కారవాన్‌, వింగర్‌ 9ఎస్‌, మ్యాజిక్‌ ఎక్స్‌ప్రెస్‌లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దినట్లు టాటా మోటార్స్‌ ఉపాధ్యక్షుడు రోహిత్‌ శ్రీవాస్తవ తెలిపారు.

కొత్త తరం వోల్వో 9600 బస్సు: నూతన శ్రేణి వోల్వో 9600 బస్సును వీఈ కమర్షియల్‌ వెహికల్స్‌ పరిచయం చేసింది.  5, 13.5 మీటర్ల పొడవైన ఇంటర్‌ సిటీ కోచ్‌లను ఆవిష్కరించింది. వీఈ కమర్షియల్‌ వెహికల్స్‌ ఎండీ వినోద్‌ అగర్వాల్‌ స్పందిస్తూ బస్సు పరిశ్రమ వేగంగా కోలుకుంటోందని, త్వరలో కొవిడ్‌ ముందు నాటి స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. స్కూలు బస్సులతో పాటు ఆఫీసు సిబ్బంది ప్రయాణాలు సాగించేవి, దూర ప్రయాణాలకు వినియోగించే బస్సుల విభాగాల్లోనూ వృద్ధి కనిపిస్తోందని అన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts