Stockmarket: సూచీలకు స్వల్ప లాభాలు
సమీక్ష
రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కీలక రేట్ల పెంపు అంచనాలకు అనుగుణంగా ఉండటంతో, సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. విదేశీ మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడం, చమురు ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు బలపడి 79.23 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు ధర 0.18 శాతం పెరిగి 94.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ ఉదయం 58,421.04 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే ఊపు కొనసాగిస్తూ ఇంట్రాడేలో 58,649.19 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకుని 58,244.86 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 89.13 పాయింట్లు పెరిగి 58,387.93 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 15.50 పాయింట్లు లాభపడి 17,397.50 దగ్గర స్థిరపడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్ 817.68 పాయింట్లు, నిఫ్టీ 239.25 పాయింట్లు చొప్పున లాభాలు నమోదుచేశాయి.
* సెన్సెక్స్ 30 షేర్లలో 17 లాభపడ్డాయి. అల్ట్రాటెక్ 2.86%, భారతీ ఎయిర్టెల్ 1.39%, పవర్‌గ్రిడ్ 1.20%, ఇన్ఫోసిస్ 1.06%, విప్రో 1.02% చొప్పున రాణించాయి. ఎం అండ్ ఎం, మారుతీ, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ 2% నష్టపోయాయి.
* ఆర్బీఐ పరపతి సమీక్ష నేపథ్యంలో వడ్డీ రేట్ల ఆధారిత షేర్లు మిశ్రమంగా ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్ 2.26%, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1.66%, యాక్సిస్ బ్యాంక్ 0.90%, ఫెడరల్ బ్యాంక్ 0.88% పెరగ్గా, బంధన్ బ్యాంక్ 1.70%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.30% నష్టపోయాయి. వాహన షేర్లలో టీవీఎస్, ఎస్కార్ట్స్, ఎంఆర్ఎఫ్, బజాజ్ ఆటో 1.46% మేర రాణించగా.. మహీంద్రా, ఐషర్, హీరో మోటో, టాటా మోటార్స్ 2% వరకు డీలాపడ్డాయి. స్థిరాస్తి షేర్లలో ఫీనిక్స్ 1.62%, ఐబీ రియల్ 0.84%, శోభా 0.5% లాభపడగా, సన్‌టెక్ రియాల్టీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ నీరసపడ్డాయి.
నేటి బోర్డు సమావేశాలు: ఎస్బీఐ * బీపీసీఎల్ * హెచ్‌పీసీఎల్ * ఐఓబీ * అమరరాజా బ్యాటరీస్ * ఆంధ్రా పెట్రోకెమికల్స్ * పాల్రెడ్ టెక్నాలజీస్ * బిర్లా కార్పొరేషన్ * జాగరణ్ ప్రకాశన్ * ఖాదిమ్ * మారికో * మంగళం సిమెంట్ * టెగా ఇండస్ట్రీస్ * ఉషా మార్టిన్ * మహానగర్ గ్యాస్
అమెరికాలో కొత్తగా 5,28,000 ఉద్యోగాలు
వాషింగ్టన్: అమెరికాలో నియామకాల జోరు కొనసాగుతోంది. గత నెలలో అక్కడి కంపెనీలు కొత్తగా 5,28,000 ఉద్యోగాలను సృష్టించాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల, మాంద్యంపై భయాలు ఉన్నప్పటికీ నియామకాలు పెరగడం గమనార్హం. కరోనా సంక్షోభం కారణంగా కోల్పోయిన అన్ని ఉద్యోగాలు మళ్లీ వచ్చాయని అమెరికా కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జూన్‌లో ఈ సంఖ్య 3,98,000 ఉద్యోగాలుగా నమోదైంది. నిరుద్యోగ రేటు 3.5 శాతానికి చేరింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Road Accident: టైరు పేలి బోల్తాపడిన కారు.. నలుగురి దుర్మరణం
-
Ts-top-news News
Hyderabad: ఆ ట్వీట్‌తో దిల్లీ నుంచి హైదరాబాద్‌కు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
-
World News
Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!