Sugar Export: పంచదార ఎగుమతిదార్లకు ఊరట!

పంచదార ఎగుమతులపై ఉన్న 10 మిలియన్‌ టన్నుల పరిమితిని ప్రభుత్వం సడలించనుంది. సెప్టెంబరుతో ముగిసే ప్రస్తుత మార్కెటింగ్‌ సంవత్సరం(2021-22)లో అదనంగా 1.2 మిలియన్‌ టన్నుల ఎగుమతికి అనుమతి ఇవ్వనుంది.

Updated : 06 Aug 2022 06:32 IST

2021-22 పరిమితుల సడలింపు
అదనంగా 1.2 మిలియన్‌ టన్నులకు అనుమతి

దిల్లీ: పంచదార ఎగుమతులపై ఉన్న 10 మిలియన్‌ టన్నుల పరిమితిని ప్రభుత్వం సడలించనుంది. సెప్టెంబరుతో ముగిసే ప్రస్తుత మార్కెటింగ్‌ సంవత్సరం(2021-22)లో అదనంగా 1.2 మిలియన్‌ టన్నుల ఎగుమతికి అనుమతి ఇవ్వనుంది. 2021-22 అక్టోబరు-సెప్టెంబరులో చక్కెర ఎగుమతులను 10 మిలియన్‌ టన్నులకు పరిమితం చేస్తూ మే నెలలో కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దేశీయంగా లభ్యత ఉండేందుకు, ధరలు స్థిరంగా కొనసాగేందుకు ఈ చర్య తీసుకున్న విషయం విదితమే. కాగా, ఇప్పటికే చక్కెర మిల్లులు 10 మిలియన్‌ టన్నుల వరకు ఎగుమతులను చేశాయి. దీంతో ఎగుమతులపై ఉన్న పరిమితిని పెంచాలని పరిశ్రమ కోరుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమం అనంతరం ఆహార కార్యదర్శి సుధాంశు పాండే మాట్లాడుతూ ‘చక్కెర ఎగుమతుల పరిమితిని 1.2 మిలియన్‌ టన్నుల మేర ప్రభుత్వం పెంచనుంద’ని స్పష్టం చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ అవుతుందనీ అన్నారు. 2020-21లో 7 మిలియన్‌ టన్నులు; అంతక్రితం ఏడాది 5.96 మి. టన్నుల మేర ఎగుమతులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని