Marico: 3% పెరిగిన మారికో లాభం

ఎఫ్‌ఎంసీజీ సంస్థ మారికో ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రూ.377 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.365 కోట్లతో పోలిస్తే ఇది  3.28 శాతం ఎక్కువ.

Updated : 07 Aug 2022 03:42 IST

దిల్లీ: ఎఫ్‌ఎంసీజీ సంస్థ మారికో ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రూ.377 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.365 కోట్లతో పోలిస్తే ఇది  3.28 శాతం ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.2,525 కోట్ల నుంచి 1.3 శాతం పెరిగి రూ.2,558 కోట్లకు చేరింది. ఇందులో దేశీయ విపణి నుంచి ఆదాయం రూ.1,992 కోట్ల నుంచి 3.56 శాతం తగ్గి     రూ.1,921 కోట్లకు పరిమితమైంది. అంతర్జాతీయ విక్రయాలు రూ.533 కోట్ల నుంచి 19.51% పెరిగి రూ.637 కోట్లకు చేరాయి. మొత్తం వ్యయాలు  రూ.2,085 కోట్ల నుంచి రూ.2,076 కోట్లకు తగ్గాయి. బలహీన గిరాకీ పరిస్థితులు, అధిక ద్రవ్యోల్బణంతో ఈ ఆర్థిక సంవత్సరం మిశ్రమంగా ప్రారంభమైందని కంపెనీ ఎండీ, సీఈఓ సౌగాటా గుప్తా వెల్లడించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గితే సమీప భవిష్యత్‌లో పరిమాణ వృద్ధిని ఆశిస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని