Kaveri Seeds: కావేరీ సీడ్‌కు రూ.240.67 కోట్ల లాభం

కావేరీ సీడ్‌ కంపెనీ జూన్‌ త్రైమాసికానికి రూ.731.95 కోట్ల ఆదాయాన్ని, రూ.240.67 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.682.41 కోట్లు, నికరలాభం రూ.201.75 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 7.26 శాతం, నికరలాభం 19.29 శాతం పెరిగాయి.

Updated : 09 Aug 2022 03:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: కావేరీ సీడ్‌ కంపెనీ జూన్‌ త్రైమాసికానికి రూ.731.95 కోట్ల ఆదాయాన్ని, రూ.240.67 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.682.41 కోట్లు, నికరలాభం రూ.201.75 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 7.26 శాతం, నికరలాభం 19.29 శాతం పెరిగాయి. పత్తి సాగు విస్తీర్ణం పెరిగిందని, దీనికి తోడు విత్తనాల మార్కెట్లో తమ వాటా పెంచుకోవడమే ఇందుకు కారణమని కావేరీ సీడ్‌ కంపెనీ సీఎండీ జీవీ భాస్కరరావు వివరించారు. కూరగాయల విత్తనాల విభాగంలో తమ అమ్మకాలు పెరుగుతున్నాయని తెలిపారు. పత్తి, వరి, కూరగాయల విత్తనాల్లో కొత్త రకాలను విడుదల చేశామన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts