TATA Motors: టాటా మోటార్స్‌కు ఫోర్డ్‌ ‘సనంద్‌’ ప్లాంటు

ఫోర్డ్‌ ఇండియాకు గుజరాత్‌లోని సనంద్‌ వద్ద ఉన్న తయారీ ప్లాంటును రూ.725.70 కోట్లకు టాటా మోటార్స్‌ కొనుగోలు చేయనుంది. ప్రయాణికుల వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ ప్లాంటును టాటా మోటార్స్‌ స్వాధీనం చేసుకుంటోంది. ఇందుకోసం కంపెనీ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌

Updated : 09 Aug 2022 03:16 IST

విలువ రూ.725.70 కోట్లు

దిల్లీ: ఫోర్డ్‌ ఇండియాకు గుజరాత్‌లోని సనంద్‌ వద్ద ఉన్న తయారీ ప్లాంటును రూ.725.70 కోట్లకు టాటా మోటార్స్‌ కొనుగోలు చేయనుంది. ప్రయాణికుల వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ ప్లాంటును టాటా మోటార్స్‌ స్వాధీనం చేసుకుంటోంది. ఇందుకోసం కంపెనీ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లిమిటెడ్‌ (టీపీఈఎంఎల్‌), ఫోర్డ్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నాయి. సనంద్‌ ప్లాంటు స్థలంలోని భవనాలు, వాహన తయారీ ప్లాంటు, యంత్రాలు, సామగ్రి లాంటివన్నీ టాటా మోటార్స్‌ సొంతం అవుతాయి. అర్హులైన ఉద్యోగులకూ అవకాశం కల్పిస్తామని టాటా మోటార్స్‌ తెలిపింది. నిర్ణీత సమయంలో కొనుగోలు పూర్తి అవుతుందని, దీని వల్ల వాటాదార్లందరికీ ప్రయోజనం కలుగుతుందని వివరించింది. సనంద్‌ ప్లాంటుకు ఏటా 3 లక్షల వాహనాల తయారీ సామర్థ్యం ఉంది. దీనిని 4.2 లక్షలకు పెంచుకోవచ్చు. తమ అవసరాలకు అనుగుణంగా ప్లాంటులో మార్పులు చేసేందుకు టీపీఈఎంఎల్‌ పెట్టుబడులు పెడుతుందని టాటా మోటార్స్‌ తెలిపింది. టాటా మోటార్స్‌కు సనంద్‌ వద్ద ఉన్న ప్లాంటు పక్కనే ఈ ప్లాంటు ఉండటం కలిసిరానుందని టాటా మోటార్స్‌ ఎండీ (ప్రయాణికుల వాహనాలు) శైలేష్‌ చంద్ర తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని