Stockmarket: 4 నెలల గరిష్ఠానికి సెన్సెక్స్‌

మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 4 నెలల గరిష్ఠానికి చేరాయి. హెచ్‌డీఎఫ్‌సీ జంట, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు రాణించడానికి తోడు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు తోడయ్యాయి. నిఫ్టీ మళ్లీ 17,500 పాయింట్ల ఎగువన ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 39 పైసలు తగ్గి 79.63 వద్ద ముగి

Updated : 09 Aug 2022 03:20 IST

17,500 ఎగువకు నిఫ్టీ

సమీక్ష

మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 4 నెలల గరిష్ఠానికి చేరాయి. హెచ్‌డీఎఫ్‌సీ జంట, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు రాణించడానికి తోడు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు తోడయ్యాయి. నిఫ్టీ మళ్లీ 17,500 పాయింట్ల ఎగువన ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 39 పైసలు తగ్గి 79.63 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 0.68 శాతం తగ్గి 94.32 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ మినహా మిగతావి లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 58,417.71 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో నష్టాల్లోకి జారుకున్న సూచీ.. 58,266.65 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అక్కడ నుంచి బలంగా పుంజుకుని, 58,934.90 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 465.14 పాయింట్ల లాభంతో 58,853.07 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 127.60 పాయింట్లు పెరిగి 17,525.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,359.75- 17,548.80 పాయింట్ల మధ్య కదలాడింది.

* జూన్‌ త్రైమాసికంలో లాభం తగ్గడంతో ఎస్‌బీఐ షేరు 1.95 శాతం నష్టపోయి  రూ.520.30 వద్ద ముగిసింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 రాణించాయి. ఎం అండ్‌ ఎం 3.13%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.95%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.41%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.40%, ఎల్‌ అండ్‌ టీ 2.34%, ఎన్‌టీపీసీ  2.12%, హెచ్‌డీఎఫ్‌సీ 1.72%, డాక్టర్‌ రెడ్డీస్‌  1.55%, రిలయన్స్‌ 1.30% చొప్పున లాభపడ్డాయి. అల్ట్రాటెక్‌ 1.63%, నెస్లే 1.15%, విప్రో 0.90%, పవర్‌గ్రిడ్‌ 0.81% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. యంత్ర పరికరాలు 2%, విద్యుత్‌ 1.92%, యుటిలిటీస్‌ 1.61%, లోహ 1.27%, వాహన 1.05% పెరిగాయి. చమురు-గ్యాస్‌ డీలాపడింది. బీఎస్‌ఈలో 1894 స్క్రిప్‌లు లాభపడగా, 1613 షేర్లు నష్టపోయాయి.  

* మార్పిడి రహిత డిబెంచర్ల జారీ ద్వారా రూ.12000 కోట్ల వరకు సమీకరించడానికి ఆగస్టు 30న వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఎన్‌టీపీసీ వాటాదార్ల అనుమతి కోరనుంది.

* జూన్‌ త్రైమాసికంలో రూ.10,196 కోట్ల నష్టాన్ని ప్రకటించడంతో హెచ్‌పీసీఎల్‌ షేరు 4.65 శాతం కుదేలై రూ.239.05 వద్ద ముగిసింది.

* బలహీన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో బీపీసీఎల్‌ షేరు 3.14 శాతం తగ్గి రూ.325.75 దగ్గర స్థిరపడింది.


నేడు మార్కెట్లకు సెలవు

మొహర్రం సందర్భంగా నేడు (మంగళవారం) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. బులియన్‌, ఫారెక్స్‌, కమొడిటీ మార్కెట్లు కూడా పని చేయవు.


నేటి బోర్డు సమావేశాలు: టాటా కెమికల్స్‌

* ఏబీబీ ఇండియానీ గ్రాన్యూల్స్‌ ఇండియా

* ఎన్‌సీసీ నీ ఇంద్రప్రస్థ గ్యాస్‌

* నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌

* ఐడీఎఫ్‌సీ

* డీబీ రియాల్టీ

* డిష్‌ టీవీ

* ఈకేసీ

* జేపీ పవర్‌          

* పీసీ జువెలర్స్‌

* ట్రైడెంట్‌

* టీవీ టుడే నెట్‌వర్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని