Infosys: అంతర్జాతీయ ఐటీ వ్యయాలు బాగున్నాయ్‌

మన ఐటీ కంపెనీలకు అధిక ఆదాయాన్ని అందించే అమెరికా, ఐరోపా సహా అంతర్జాతీయంగా ఐటీ వ్యయాలు బాగున్నాయని ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ పేర్కొన్నారు.

Updated : 10 Aug 2022 03:02 IST

అందుకే ఇన్ఫోసిస్‌ అధిక ఆదాయ వృద్ధి అంచనాలు
సీఈఓ సలీల్‌ పరేఖ్‌

బెంగళూరు: మన ఐటీ కంపెనీలకు అధిక ఆదాయాన్ని అందించే అమెరికా, ఐరోపా సహా అంతర్జాతీయంగా ఐటీ వ్యయాలు బాగున్నాయని ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 14-16 శాతం ఆదాయ వృద్ధి అంచనా ఇచ్చిన ఇన్ఫోసిస్‌ చాలా ‘సౌకర్యవంతం’గా ఉందని వివరించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను మాంద్యం భయాలు వెంటాడుతున్నా.. ఇన్ఫీ సీఈఓ నుంచి ఆశావహ వ్యాఖ్యలు వెలువడడం విశేషం. అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో కొన్ని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు నియామక ప్రణాళికల్లో వెనకడుగు వేస్తున్నాయి కూడా. అయితే సలీల్‌ మాత్రం ‘అంతర్జాతీయ ఐటీ వ్యయాలు మెరుగ్గానే ఉన్నాయని, డిజిటల్‌కు మారడంపై ఖాతాదారులు స్పష్టతతో ఉన్నార’ని పేర్కొన్నారు. నిర్వహణ సామర్థ్యం, ఆటోమేషన్‌ వల్ల డబుల్‌ ఇంజిన్‌ వృద్ధి కనిపిస్తుందని అన్నారు. ‘అమెరికా, ఐరోపాలలో జులై వినియోగదారు వ్యయాలు పెరిగాయి. కంపెనీ అన్ని విషయాలను గమనిస్తూ ఉంద’ని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని