Natco Pharma: నాట్కో ఫార్మాకు రూ.320 కోట్ల లాభం

నాట్కో ఫార్మా జూన్‌ త్రైమాసికానికి అత్యంత ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.918.9 కోట్ల ఆదాయం పై రూ.320.4 కోట్ల నికరలాభం నమోదైంది.

Updated : 10 Aug 2022 02:32 IST

115% పెరిగిన ఆదాయం
మధ్యంతర డివిడెండ్‌ రూ.3.50 

ఈనాడు, హైదరాబాద్‌: నాట్కో ఫార్మా జూన్‌ త్రైమాసికానికి అత్యంత ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.918.9 కోట్ల ఆదాయం పై రూ.320.4 కోట్ల నికరలాభం నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.427.3 కోట్లు, నికరలాభం రూ.75 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. దీంతో పోల్చితే ఆదాయం 115 శాతం, నికరలాభం నాలుగున్నర రెట్లు పెరిగింది. అమెరికాలో గత మార్చిలో ప్రవేశపెట్టిన లెనలిడోమైడ్‌ ఔషధ విక్రయాల నుంచి అధిక ఆదాయాలు, లాభాలు కనిపిస్తున్నట్లు నాట్కో ఫార్మా ఎండీ వీసీ నన్నపనేని తెలియజేశారు. మల్టిపుల్‌ మైలోమా అనే కేన్సర్‌ వ్యాధికి చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నారు. దేశీయ మార్కెట్లో ఫార్ములేషన్‌ ఔషధాల ఆదాయాలు స్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు. సిబ్బందికి అమలు చేసిన పదవీ విరమణ పథకాలతో పాటు పరిశోధన- అభివృద్ధికి చేసిన అధిక వ్యయాల వల్ల ఖర్చులు కొంత ఎక్కువగా నమోదైనట్లు వివరించారు. వాటాదార్లకు రూ.2 ముఖ విలువ కల ఒక్కో షేరుకు రూ.3.50 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించాలని నాట్కో ఫార్మా డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. డివిడెండ్‌ చెల్లింపునకు ఈ నెల 22ను రికార్డు తేదీగా నిర్ణయించారు. కంపెనీలో ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న డాక్టర్‌ పవన్‌ గణపతి భట్‌ను, డైరెక్టర్ల బోర్డులోకి తీసుకోవాలని ప్రతిపాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని