Gopal Vittal: 2024 మార్చి కల్లా ప్రతి పట్టణానికి 5జీ సేవలు

5జీ సేవలను ఈ నెలలో ప్రారంభించి,  2024 మార్చి కల్లా అన్ని పట్టణాలు, కీలక గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) గోపాల్‌ విత్తల్‌ పేర్కొన్నారు.

Updated : 10 Aug 2022 10:12 IST

ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విత్తల్‌

దిల్లీ: 5జీ సేవలను ఈ నెలలో ప్రారంభించి,  2024 మార్చి కల్లా అన్ని పట్టణాలు, కీలక గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) గోపాల్‌ విత్తల్‌ పేర్కొన్నారు. దేశీయంగా మొబైల్‌ సేవల ధరలు (టారిఫ్‌) చాలా తక్కువగా ఉన్నాయని.. అవి పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘ఆగస్టులోనే 5జీ సేవలను ప్రారంభించనున్నాం. 5,000 పట్టణాల్లో ఈ సేవలను మొదలుపెట్టడానికి కావాల్సిన నెట్‌వర్క్‌ను సిద్ధం చేశాం. మా చరిత్రలో అతిపెద్ద ప్రారంభాల్లో ఇదీ ఒకటి అవుతుంద’ని కంపెనీ ఫలితాల అనంతర కాల్‌లో గోపాల్‌ విత్తల్‌ పేర్కొన్నారు. తాము ఏర్పాటు చేస్తున్న నాస్‌ స్టాండలోన్‌ 5జీ నెట్‌వర్క్స్‌ వల్ల కాల్‌ కనెక్టింగ్‌ సమయం, నెట్‌కు అప్‌లింకింగ్‌ సమయం మరింత తగ్గుతాయని వివరించారు.

ఇటీవల జరిగిన వేలంలో కంపెనీ 19,867.8 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది. ఇందుకుగాను రూ.43,040 కోట్లను ఖర్చుపెట్టింది. ‘తమ వద్ద ఉన్న 900 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌తో పోలిస్తే 700 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ వల్ల అదనపు కవరేజీ ఏమీ లభించద’ని ఆయన వివరించారు. అయితే 700 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్‌వల్ల తక్కువ మొబైల్‌ టవర్లతోనే ఎక్కువ ప్రాంతాన్ని కవరేజీ చేయొచ్చు. ఖరీదైన 700 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను తాజా వేలంలో జియో ఒక్కటే కొనుగోలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని