Rainbow Children Hospitals: రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌కు రూ.237 కోట్ల ఆదాయం

రెయిన్‌బో హాస్పిటల్స్‌ (రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌) జూన్‌ త్రైమాసికంలో రూ.237.15 కోట్ల ఆదాయాన్ని, రూ.38.76 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.2021-22 ఇదే కాలంలో ఆదాయం రూ.246.35 కోట్లు, నికరలాభం రూ.35.88 కోట్లు ఉన్నాయి.

Updated : 10 Aug 2022 02:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: రెయిన్‌బో హాస్పిటల్స్‌ (రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌) జూన్‌ త్రైమాసికంలో రూ.237.15 కోట్ల ఆదాయాన్ని, రూ.38.76 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.2021-22 ఇదే కాలంలో ఆదాయం రూ.246.35 కోట్లు, నికరలాభం రూ.35.88 కోట్లు ఉన్నాయి. ఏడాది క్రితం కొవిడ్‌ టీకా ఆదాయం రూ.44 కోట్లు అని, దీన్ని మినహాయిస్తే ఆదాయం రూ.202 కోట్లు అని సంస్థ పేర్కొంది. జనవరి- మార్చి త్రైమాసికంలో ఆదాయం రూ.212.44 కోట్లు, నికరలాభం రూ.12.26 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చినా జూన్‌ త్రైమాసికంలో నికరలాభం 216 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో వైద్య పడకల ఆక్యుపెన్సీ 43.08 శాతానికి పెరిగిందని, ఇన్‌/ అవుట్‌ పేషెంట్ల సంఖ్య కొవిడ్‌ ముందు స్థాయికి చేరుకున్నట్లు, రెయిన్‌బో హాస్పిటల్స్‌ సీఎండీ డాక్టర్‌ రమేష్‌ కంచర్ల వివరించారు. ఇదే తరహా వృద్ధి మున్ముందు కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చెన్నైలో కొత్త ఆసుపత్రిని ప్రస్తుత త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మిగిలిన నగరాల్లోనూ కొత్త ఆసుపత్రుల ఏర్పాటు పనులు నిర్ణీత ప్రణాళిక ప్రకారమే సాగుతున్నట్లు వెల్లడించారు. రెయిన్‌బో హాస్పిటల్స్‌ దేశవ్యాప్తంగా 6 నగరాల్లో 14 ఆసుపత్రులు, 3 క్లినిక్‌లు నిర్వహిస్తోంది. ఈ సంస్థకు 1500 వైద్య పడకల సామర్థ్యం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని