NCC: 61% పెరిగిన ఎన్‌సీసీ ఆదాయం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నిర్మాణ రంగ సంస్థ ఎన్‌సీసీ ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.3,350.91 కోట్ల ఆదాయాన్ని, రూ.129.64 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Updated : 10 Aug 2022 03:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నిర్మాణ రంగ సంస్థ ఎన్‌సీసీ ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.3,350.91 కోట్ల ఆదాయాన్ని, రూ.129.64 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.2,083.21 కోట్లు, నికర లాభం రూ.49.95 కోట్లుగా ఉన్నాయి. దీంతో పోలిస్తే ఇప్పుడు మొత్తం ఆదాయంలో 61 శాతం వృద్ధి నమోదయ్యింది. సమీక్షా త్రైమాసికంలో రూ.4,456 కోట్ల ఆర్డర్లను సాధించింది. ఫలితంగా జూన్‌ చివరి నాటికి మొత్తం ఆర్డర్ల విలువ దాదాపు రూ.40,616 కోట్లుగా ఉందని సంస్థ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని