ఆద్యంతం ఒడుదొడుకులే

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీలు మిశ్రమంగా ముగిశాయి. లోహ, చమురు- గ్యాస్‌ షేర్లు రాణించినప్పటికీ..

Published : 11 Aug 2022 05:15 IST

నిఫ్టీకి లాభం; సెన్సెక్స్‌కు నష్టం

సమీక్ష

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీలు మిశ్రమంగా ముగిశాయి. లోహ, చమురు- గ్యాస్‌ షేర్లు రాణించినప్పటికీ.. ఐటీ, స్థిరాస్తి షేర్లలో లాభాల స్వీకరణ ఎదురైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు పెరిగి 79.47 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 1.05 శాతం తగ్గి 95.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు లాభాల్లో కదలాడాయి.
సెన్సెక్స్‌ ఉదయం 58,977.34 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో జారుకున్న సూచీ.. 58,583.36 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. అనంతరమూ ఒడుదొడుకుల మధ్యే కోలుకున్న సూచీ.. చివరకు 35.78 పాయింట్ల నష్టంతో 58,817.29 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 9.65 పాయింట్లు పెరిగి 17,534.75 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,442.80- 17,566.10 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 13 లాభపడ్డాయి. టాటా స్టీల్‌ 1.91%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.50%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.45%, ఎల్‌ అండ్‌ టీ 1.38%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.09%, సన్‌ఫార్మా 0.97% చొప్పున రాణించాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 2.66%, ఎన్‌టీపీసీ  2.20%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.41%, విప్రో 1.34%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.27%, అల్ట్రాటెక్‌ 1.17%, ఎస్‌బీఐ  1.11%, ఇన్ఫోసిస్‌ 1.09% నీరసపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో లోహ 1.87%, యంత్ర పరికరాలు 1.29% పెరిగాయి. ఐటీ, స్థిరాస్తి, చమురు- గ్యాస్‌, మన్నికైన వినిమయ వస్తువులు పడ్డాయి. బీఎస్‌ఈలో 1509 స్క్రిప్‌లు లాభపడగా, 1903 షేర్లు నష్టపోయాయి. 113 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.  
నేటి బోర్డు సమావేశాలు: అపోలో హాస్పిటల్స్‌ * అరబిందో ఫార్మా * బాటా ఇండియా * రామ్‌కీ ఇన్‌ఫ్రా * కేసీపీ షుగర్‌ * కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ * స్పెన్సర్స్‌ రిటైల్‌ * భారత్‌ ఫోర్జ్‌ * బీపీఎల్‌ * సెంట్రమ్‌ క్యాపిటల్‌ * పేజ్‌ ఇండస్ట్రీస్‌ * ట్రెంట్‌ * వండర్లా హాలీడేస్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని