కిమ్స్‌ అనుబంధంగా సన్‌షైన్‌ హాస్పిటల్స్‌

కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.500 కోట్ల ఆదాయాన్ని,        రూ.79.24 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

Published : 11 Aug 2022 05:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.500 కోట్ల ఆదాయాన్ని,        రూ.79.24 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.477 కోట్లు, నికరలాభం రూ.92 కోట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సన్‌షైన్‌ హాస్పిటల్స్‌, తన అనుబంధ సంస్థగా మారినట్లు కిమ్స్‌ హాస్పిటల్స్‌ వెల్లడించింది. సన్‌షైన్‌ హాస్పిటల్స్‌లో 51.07% వాటాను కొంతకాలం క్రితం కిమ్స్‌ హాస్పిటల్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే. సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ వల్ల ఆర్థోపెడిక్‌ సేవల విభాగంలో తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లు కిమ్స్‌ పేర్కొంది. స్థిరమైన ఆదాయాలు ఆర్జిస్తున్నందున, తన ఆస్తి, అప్పుల పట్టీ బలంగా మారిందని, అందువల్ల భవిష్యత్తులో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్నట్లు కిమ్స్‌ హాస్పిటల్స్‌ పేర్కొంది.

‘కొత్త వైద్య విభాగాలు ప్రవేశపెడతాం’: జూన్‌ త్రైమాసికంలో రికార్డు స్థాయి ఆదాయాలు నమోదు చేశామని.. రోగుల సంఖ్య అధికంగా ఉండటం, ఆ మేరకు వైద్య సేవలు అందించడమే ఇందుకు కారణమని కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ బి.భాస్కరరావు వివరించారు. అనుబంధ సంస్థగా మారిన సన్‌షైన్‌ హాస్పిటల్స్‌లో కొత్త వైద్య విభాగాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన 9 నెలల కాలంలో ఆకర్షణీయ వృద్ధిని నమోదు చేస్తామనే ఆశాభావంతో ఉన్నట్లు పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts