హిందాల్కో లాభం రూ.4,119 కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో హిందాల్కో ఇండస్ట్రీస్‌ రూ.4,119 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.2,787 కోట్లతో పోలిస్తే ఇది 47.7 శాతం ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.41,358 కోట్ల నుంచి రూ.58,018 కోట్లకు పెరిగింది.

Published : 11 Aug 2022 05:15 IST

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో హిందాల్కో ఇండస్ట్రీస్‌ రూ.4,119 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.2,787 కోట్లతో పోలిస్తే ఇది 47.7 శాతం ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.41,358 కోట్ల నుంచి రూ.58,018 కోట్లకు పెరిగింది. ‘కార్యకలాపాల సామర్థ్యం పటిష్ఠంగా ఉండటం, కీలకమైన ముడి పదార్థాలను ముందస్తుగా సమీకరించడం వల్ల సమీక్షా త్రైమాసికంలో మా పని తీరు బాగుంది. కార్యకలాపాల్లో స్థిరత్వం వల్ల అధిక మార్జిన్‌లు లభించాయి. అందుకే ముడి పదార్థాల వ్యయాలు పెరిగినా, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లున్నా తొలి త్రైమాసికంలో బలమైన ఫలితాలు నమోదు చేశామ’ని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతీశ్‌ పాయ్‌ వెల్లడించారు. రాగి వ్యాపార ఆదాయం 48 శాతం పెరిగి రూ.10,529 కోట్లుగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని