5.64 కోట్ల పాలసీబజార్‌ ఖాతాదారుల వివరాలు లీక్‌ అయ్యాయ్‌ : సైబర్‌ఎక్స్‌9

ఆన్‌లైన్‌లో బీమా సేవలందించే పాలసీబజార్‌ వ్యవస్థల్లో లోపాల కారణంగా లక్షల మంది ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు బయటకు వచ్చాయని, ఇందులో రక్షణ రంగ వ్యక్తులవీ ఉన్నట్లు సైబర్‌ సెక్యూరిటీ

Published : 11 Aug 2022 05:29 IST

దిల్లీ: ఆన్‌లైన్‌లో బీమా సేవలందించే పాలసీబజార్‌ వ్యవస్థల్లో లోపాల కారణంగా లక్షల మంది ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు బయటకు వచ్చాయని, ఇందులో రక్షణ రంగ వ్యక్తులవీ ఉన్నట్లు సైబర్‌ సెక్యూరిటీ పరిశోధనా సంస్థ సైబర్‌ఎక్స్‌9 వెల్లడించింది. వినియోగదారుల ఆధార్‌, పాన్‌ కార్డ్‌ వివరాలతో పాటు చిరునామాలు, ఫోన్‌ నంబర్లు బయటకు వచ్చాయని పేర్కొంది. ఈ డేటా చౌర్యంపై పాలసీబజార్‌కు జులై 18న తెలిపింది. వెల్లడించింది. జులై 19న వ్యవస్థలో లోపాలను గుర్తించామని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు జులై 24న పాలసీబజార్‌ సమాచారమిచ్చింది. అయితే ఖాతాదారుల ప్రధాన వివరాలు బయటకు రాలేదని పేర్కొంది. గుర్తించిన లోపాలను సరిచేశామని, ఒక సలహాదారు ఈ అంశాన్ని ధ్రువీకరించినట్లు పాలసీబజార్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించామని, ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదన్నారు. పాలసీబజార్‌ పోర్టల్‌పై లావాదేవీలు జరిపిన 5.64 కోట్ల మంది వివరాలు బయటకు వచ్చాయని సైబర్‌ఎక్స్‌9 చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని