IT Jobs: ఐటీలో వలసలు తగ్గుతాయ్‌

రాబోయే త్రైమాసికాల్లో సిబ్బంది వలసల రేటు తగ్గుతుందని ఇన్ఫోసిస్‌ అంచనా వేస్తోంది. ఉద్యోగులతో తరచూ మాట్లాడుతుండడం; శిక్షణ ఇవ్వడం, వేతన పెంపుల వంటివి ఇందుకు ఉపకరిస్తాయని

Updated : 11 Aug 2022 11:02 IST

వేతన పెంపులు ఉపకరిస్తాయ్‌

ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌

బెంగళూరు: రాబోయే త్రైమాసికాల్లో సిబ్బంది వలసల రేటు తగ్గుతుందని ఇన్ఫోసిస్‌ అంచనా వేస్తోంది. ఉద్యోగులతో తరచూ మాట్లాడుతుండడం; శిక్షణ ఇవ్వడం, వేతన పెంపుల వంటివి ఇందుకు ఉపకరిస్తాయని భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమలో వలసల నిరోధానికి ఉద్యోగులకు అధిక వేతనాలు, ప్రోత్సాహకాలను ఇవ్వాల్సి వస్తున్నందున, కంపెనీల లాభదాయకతపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ సీఈఓ ఇలా వ్యాఖ్యానించారు. త్రైమాసికం వారీ వలసల రేటు విషయంలో ఇప్పటికే ఇన్ఫోసిస్‌ కొంత మెరుగవుతోందని పరేఖ్‌ గుర్తు చేశారు. ‘వార్షిక పద్ధతిలోనూ అది ప్రతిబింబించడానికి కొంత సమయం పడుతుంది. త్రైమాసికాలు గడిచే కొద్దీ వలసలు మరింత నియంత్రణలోకి వస్తాయ’ని సలీల్‌ పేర్కొన్నారు. మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2022 జూన్‌లో ఇన్ఫోసిస్‌ వలసల రేటు 27.7 శాతం నుంచి 28.4 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. ‘ఉద్యోగులతో సంబంధాలను మరింత పెంచుకోవడంతో పాటు, పలు చర్యల వల్ల నియంత్రణ దిశగా, అంచనాలకు తగ్గట్లుగా, కరోనా ముందు స్థాయికి వలసల రేటును తీసుకెళ్లగలమన్న ధీమా తమకు ఉంద’ని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని