ప్రైవేట్ టెలికాం నెట్వర్క్ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం: డాట్
ప్రైవేట్ టెలికాం నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి టెలికాం విభాగం (డాట్) దరఖాస్తులను ఆహ్వానించింది. నికర సంపద రూ.100 కోట్లకు పైగా ఉన్న సంస్థలు డాట్ నుంచి
దిల్లీ: ప్రైవేట్ టెలికాం నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి టెలికాం విభాగం (డాట్) దరఖాస్తులను ఆహ్వానించింది. నికర సంపద రూ.100 కోట్లకు పైగా ఉన్న సంస్థలు డాట్ నుంచి నేరుగా స్పెక్ట్రమ్ పొందేందుకు దరఖాస్తులు సమర్పించవచ్చు. క్యాప్టివ్ నాన్- పబ్లిక్ నెట్‌వర్క్‌కు (సీఎన్‌పీఎన్) సంబంధించి జూన్ 27న ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ‘సీఎన్‌పీఎన్ ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు, టెలికాం సేవల సంస్థలు లేదా డాట్ నుంచి నేరుగా స్పెక్ట్రమ్‌ను లీజ్‌పై తీసుకోవచ్చని మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఈ సంస్థలకు స్పెక్ట్రమ్‌ను ఇచ్చేందుకు వాటి అవసరంపై డాట్ అధ్యయనం (డిమాండ్ స్టడీస్) చేస్తుందని’ అధికారిక ప్రకటన వెల్లడించింది. అధ్యయనం నిమిత్తం సరళ్ సంచార్ పోర్టల్‌పై ఓ విధానాన్ని డాట్ ప్రారంభించింది. దరఖాస్తుల సమర్పణకు గడువు సెప్టెంబరు 9తో ముగుస్తుంది. అయితే ప్రస్తుతమున్న టెలికాం సంస్థల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నందున.. సీఎన్‌పీఎన్ ఏర్పాటు కోసం స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించేందుకు ఓ నిబంధనను డాట్ తీసుకొచ్చింది. అలాగే ఈ సంస్థలకు ఏ ధరకు స్పెక్ట్రమ్‌ను కేటాయించాలనే అంశంపై ట్రాయ్ అభిప్రాయాన్ని కూడా డాట్ తీసుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్‌గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!