3 రెట్లు పెరిగిన ఆయిల్‌ ఇండియా లాభం

జూన్‌ త్రైమాసికంలో ఆయిల్‌ ఇండియా  రూ.1,556 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభం రూ.507.94 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం.

Published : 11 Aug 2022 05:29 IST

దిల్లీ: జూన్‌ త్రైమాసికంలో ఆయిల్‌ ఇండియా  రూ.1,556 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభం రూ.507.94 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.3,003.69 కోట్ల నుంచి రూ.5,967.55 కోట్లకు పెరిగింది. ఇతర ఆదాయం రూ.67.09 కోట్ల నుంచి రూ.62.31 కోట్లకు తగ్గింది. మొత్తం వ్యయాలు రూ.2,393.41 కోట్ల నుంచి  రూ.3,922.18 కోట్లకు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, దేశీయంగా గ్యాస్‌ ధరలు బాగా పెరగడంతో లాభం 3 రెట్లు పెరిగిందని కంపెనీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని