178% పెరిగిన కోల్‌ ఇండియా లాభం

కోల్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రూ.8,834 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభం రూ.3,174 కోట్లతో పోలిస్తే ఇది 178 శాతం

Published : 11 Aug 2022 05:29 IST

కోల్‌కతా: కోల్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రూ.8,834 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభం రూ.3,174 కోట్లతో పోలిస్తే ఇది 178 శాతం అధికం. విక్రయాల ఆదాయం రూ.23,293 కోట్ల నుంచి రూ.32,498 కోట్లకు చేరింది. బొగ్గు ఇ-వేలం ద్వారా టన్నుకు రూ.4,340 చొప్పున సంస్థకు లభించింది. సుమారు 21 మిలియన్‌ టన్నుల బొగ్గును ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఇ-వేలం ద్వారా కోల్‌ ఇండియా విక్రయించింది. ఉత్పత్తి పెరగడంతో, మొత్తం వ్యయాలు కూడా రూ.21,626 కోట్ల నుంచి రూ.23,985 కోట్లకు చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని