Vedanta: 8 ఏళ్లలో రూ.8 లక్షల కోట్ల కంపెనీగా వేదాంతా!

వేదాంతా మరో ఎనిమిదేళ్లలో 100 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.8 లక్షల కోట్ల) కంపెనీగా రాణించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు తగ్గట్లుగా అన్ని వ్యాపారాల్లో సామర్థ్య విస్తరణ చేయాలని

Updated : 11 Aug 2022 07:58 IST

దిల్లీ: వేదాంతా మరో ఎనిమిదేళ్లలో 100 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.8 లక్షల కోట్ల) కంపెనీగా రాణించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు తగ్గట్లుగా అన్ని వ్యాపారాల్లో సామర్థ్య విస్తరణ చేయాలని భావిస్తోంది. అధిక వృద్ధి నిమిత్తం ప్రణాళికలను రచిస్తున్నట్లు వార్షిక సాధారణ సమావేశాల(ఏజీఎమ్‌) సందర్భంగా కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జింక్‌, చమురు-గ్యాస్‌ వంటి రంగాల్లో 2 బిలియన్‌ డాలర్ల మేర మూలధన పెట్టబడులు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపింది. సెమీకండక్టర్‌ ఫ్యాబ్‌, డిస్‌ప్లే ఫ్యాబ్‌ తయారీలోకి అడుగుపెడుతున్నట్లు వేదాంతా ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా సెమీకండక్టర్లకు సరఫరా కొరత ఏర్పడింది. వీటికోసం భారత్‌ 100 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది. 2026 కల్లా సెమీకండక్టర్ల దేశీయ వినియోగం 80 బిలియన్‌ డాలర్లను అధిగమించవచ్చు. 2030 కల్లా 110 బిలియన్‌ డాలర్లకూ చేరొచ్చ’ని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని