అమెరికాలో పెరిగిన నిరుద్యోగ దరఖాస్తులు

అమెరికాలో నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గతవారం 14,000 పెరిగి 2,62,00కి చేరింది. నవంబరు తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. అమెరికాలో నియామకాలపరంగా సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ నిరుద్యోగ దరఖాస్తులు పెరగడం గమనార్హం. గత ఆరువారాల్లో ఐదు

Published : 12 Aug 2022 03:13 IST

దిల్లీ: అమెరికాలో నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గతవారం 14,000 పెరిగి 2,62,00కి చేరింది. నవంబరు తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. అమెరికాలో నియామకాలపరంగా సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ నిరుద్యోగ దరఖాస్తులు పెరగడం గమనార్హం. గత ఆరువారాల్లో ఐదు వారాలు దరఖాస్తుల సంఖ్య పెరిగిందని ఆ దేశ కార్మిక శాఖ వెల్లడించింది. నాలుగు వారాల్లో దరఖాస్తుల సంఖ్య సగటున 4,500 పెరిగి 2,52,000కి చేరింది. ఇది కూడా నవంబరు తర్వాత అత్యధికమే. గత నెలలో 5,28,000 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని అమెరికా కార్మిక శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము అంచనా వేసిన దాని కంటే కూడా ఇది రెట్టింపు అని పేర్కొంది. జులైలో నిరుద్యోగిత రేటు 3.5 శాతానికి తగ్గింది. కొవిడ్‌-19 పరిణామాల నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా పుంజుకుంది. అయితే ద్రవ్యోల్బణంపరంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం నియంత్రణకు అమెరికా ఫెడ్‌ కీలక రేట్లను పెంచుతూ వస్తోంది. దీంతో జూన్‌లోని 40 ఏళ్ల గరిష్ఠమైన 9.1 శాతం నుంచి జులైలో స్వల్పంగా 8.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివచ్చింది. మరోవైపు అధిక వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించడం ప్రారంభమైంది. అయితే ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదించడం, అధిక ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా అమెరికా నియామకాల విపణిలో సానుకూల పరిస్థితులు కొనసాగుతుండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని