డిజిటల్‌ కరెన్సీలో భారత్‌కు 7వ స్థానం

భారత జనాభాలో 7 శాతానికి పైగా ప్రజలు డిజిటల్‌ కరెన్సీ కలిగి ఉన్నారని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) వెల్లడించింది. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీల వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిందని తెలిపింది. యూఎన్‌ వాణిజ్యం, అభివృద్ధి సమాఖ్య యూఎన్‌సీటీఏడీ ప్రకారం, 2021లో అభివృద్ధి చెందిన 20 ఆర్థిక వ్యవస్థల్లో 15 దేశాల జనాభా క్రిప్టో కరెన్సీలు కలిగి

Published : 12 Aug 2022 03:13 IST

ఐక్యరాజ్యసమితి: భారత జనాభాలో 7 శాతానికి పైగా ప్రజలు డిజిటల్‌ కరెన్సీ కలిగి ఉన్నారని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) వెల్లడించింది. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీల వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిందని తెలిపింది. యూఎన్‌ వాణిజ్యం, అభివృద్ధి సమాఖ్య యూఎన్‌సీటీఏడీ ప్రకారం, 2021లో అభివృద్ధి చెందిన 20 ఆర్థిక వ్యవస్థల్లో 15 దేశాల జనాభా క్రిప్టో కరెన్సీలు కలిగి ఉన్నారు. ఉక్రెయిన్‌ జాబితాలో 12.7 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. రష్యా (11.9 శాతం), వెనెజువెలా (10.3 శాతం), సింగపూర్‌ (9.4 శాతం), కెన్యా (8.5 శాతం), యూఎస్‌ (8.3 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మన దేశంలో 7.3 శాతం మంది ప్రజలు డిజిటల్‌ కరెన్సీ కలిగి ఉన్నారు. అంతర్జాతీయంగా 20 ఆర్థిక వ్యవస్థల్లో డిజటల్‌ కరెన్సీ వాటా కలిగి ఉన్న జనాభాలో భారత దేశానికి ఏడో స్థానం లభించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని