రూ.57,575 కోట్లతో ఒడిశాలో అదానీ అల్యూమినా ప్లాంటు

అదానీ గ్రూప్‌ మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. రూ.57,575 కోట్లతో ఒడిశాలో అల్యుమినా ప్లాంటును ఏర్పాటు చేయబోతోంది. 4 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న అల్యూమినా రిఫైనరీని ఈ రాష్ట్రంలో నిర్మించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Published : 12 Aug 2022 03:13 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. రూ.57,575 కోట్లతో ఒడిశాలో అల్యుమినా ప్లాంటును ఏర్పాటు చేయబోతోంది. 4 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న అల్యూమినా రిఫైనరీని ఈ రాష్ట్రంలో నిర్మించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా 30 మిలియన్‌ టన్నుల ముడి ఇనుము ప్రాజెక్టును సైతం ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అదానీ గ్రూప్‌ ప్రతిపాదనను ఒడిశా ముఖ్య మంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆధ్వర్యంలోని అత్యున్నత స్థాయి అనుమతి మండలి(హెచ్‌ఎల్‌సీఏ) ఆమోద ముద్ర వేసిందని ఆ ప్రకటనలో వెల్లడించింది. ‘మాకు అత్యంత వ్యూహాత్మక రాష్ట్రాల్లో ఒడిశా కూడా ఒకటి. ఇక్కడ మేం పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉన్నాం. ముఖ్య మంత్రి నవీన్‌ పట్నాయక్‌ నుంచి మాకు మంచి ప్రోత్సాహం లభిస్తోంద’ని గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ పేర్కొన్నారు. ‘రూ.57,575 కోట్ల పెట్టుబడుల కారణంగా ఒడిశాలో ప్రత్యక్షంగా 9,300 మందికి ఉద్యోగాలు లభిస్తాయ’ని తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts