బాటా ఇండియా లాభంలో 72% వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో బాటా ఇండియా ఏకీకృత నికర లాభం రూ.119.37 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.69.47 కోట్లతో పోలిస్తే ఇది 71.82 శాతం అధికం కావడం విశేషం. అత్యధిక త్రైమాసిక విక్రయాలు ఇందుకు దోహదం చేశాయి. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం సైతం

Published : 12 Aug 2022 03:13 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో బాటా ఇండియా ఏకీకృత నికర లాభం రూ.119.37 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.69.47 కోట్లతో పోలిస్తే ఇది 71.82 శాతం అధికం కావడం విశేషం. అత్యధిక త్రైమాసిక విక్రయాలు ఇందుకు దోహదం చేశాయి. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం సైతం మూడింతలై రూ.267.04 కోట్ల నుంచి రూ.943.01 కోట్లకు చేరుకుంది. ‘డిజిటల్‌ విస్తరణ, వినియోగదారులతో సత్సంబంధాల వంటి కీలక అంశాల్లో తగిన చర్యలు తీసుకోవడంతో త్రైమాసిక విక్రయాలు జీవన కాల గరిష్ఠానికి చేరాయ’ని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తం వ్యయాలు సైతం రెండింతలై రూ.371.61 కోట్ల నుంచి రూ.792.58 కోట్లకు చేరుకున్నాయి. ఫ్యాషనబుల్‌, ట్రెండీ, సౌకర్యవంతమైన పాదరక్షలకు గిరాకీ పెరగడంతో త్రైమాసికం వారీగా విక్రయాలు రాణించాయని కంపెనీ ఎండీ, సీఈఓ గుంజన్‌ షా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని