ఇంటి నుంచి పనికి అనుమతి తీసుకోవాలి

ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజడ్‌)లో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు, తమ ఉద్యోగులకు ‘ఇంటి నుంచి పని’కి అవకాశం కల్పించాలంటే, ప్రత్యేక పథకాన్ని రూపొందించడంతో పాటు,

Updated : 13 Aug 2022 12:18 IST

ఎస్‌ఈజడ్‌లకు వాణిజ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు

దిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజడ్‌)లో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు, తమ ఉద్యోగులకు ‘ఇంటి నుంచి పని’కి అవకాశం కల్పించాలంటే, ప్రత్యేక పథకాన్ని రూపొందించడంతో పాటు, సంబంధిత డెవలప్‌మెంట్‌ కమిషనర్ల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్‌ఈజడ్‌లలోని సంస్థలు తమ ఉద్యోగులకు గరిష్ఠంగా ఏడాదిపాటు ఇంటి నుంచి పని వెసులుబాటు కల్పించేందుకు జులైలో ప్రభుత్వం అనుమతించింది. దీన్ని 50 శాతం వరకు ఉద్యోగులకు అమలు చేయొచ్చని పేర్కొంది. దీన్ని ఉపయోగించుకోవాలనుకునే సంస్థలు..  ఇంటి నుంచి పనికి అనుమతినివ్వడానికి 14 రోజుల ముందు డెవలప్‌మెంట్‌ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎస్‌ఈజడ్‌ల నిబంధనలు 2016లో కొత్తగా 43ఏ సెక్షన్‌ను చేర్చింది. వర్క్‌ ఫ్రం హోమ్‌ పథకం కోసం దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా అనుమతి లభిస్తుందని, ఒకవేళ ఎలాంటి సమాచారం లేకపోతే.. 15 రోజుల తర్వాత అంగీకరించినట్లే భావించాలని తెలిపింది.
* ఎస్‌ఈజడ్‌లలోని ఐటీ/ఐటీఈఎస్‌ సంస్థల ఉద్యోగులు, తాత్కాలిక అసమర్థతను ఎదుర్కొంటున్న సిబ్బంది, పర్యటనలలో ఉన్న ఉద్యోగులు, ఆఫ్‌సైట్‌లో పనిచేస్తున్న నిపుణులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
* ఇంటి నుంచి పని కోసం తరలించే ఎలక్ట్రానిక్‌ పరికరాల వివరాలన్నింటినీ తప్పనిసరిగా నమోదు చేయాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని