జులైలో స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం

కూరగాయలు, వంటనూనెల వంటి ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో జులైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.71 శాతానికి పరిమితమైంది. అయినా వరుసగా ఏడో నెలా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) సౌకర్యవంత స్థాయి (6 శాతం)

Published : 13 Aug 2022 02:18 IST

దిల్లీ: కూరగాయలు, వంటనూనెల వంటి ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో జులైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.71 శాతానికి పరిమితమైంది. అయినా వరుసగా ఏడో నెలా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) సౌకర్యవంత స్థాయి (6 శాతం) ఎగువనే ఉంది. దీంతో వచ్చే సమీక్షలోనూ ఆర్‌బీఐ  కీలక రేట్లను పెంచొచ్చని భావిస్తున్నారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూన్‌లో 7.01 శాతం కాగా , 2021 జులైలో 5.59 శాతంగా నమోదైంది. 2022 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు 7 శాతం ఎగువనే ద్రవ్యోల్బణం ఉంది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) గణాంకాల ప్రకారం..
* జులైలో ఆహార ద్రవ్యోల్బణం 6.75 శాతానికి చేరింది. జూన్‌లో ఇది 7.75 శాతంగా ఉంది.  కూరగాయల ధరలు మేలో 17.37% పెరగ్గా.. జూన్‌లో 10.90% పెరిగాయి. నూనెలు, కొవ్వుల ధరలు 7.52 శాతం అధికమయ్యాయి.
* ఇంధన ద్రవ్యోల్బణం 10.39 శాతం నుంచి 11.76 శాతానికి చేరింది. మాంసం-చేపలు, పప్పుల ధరలు వరుసగా 9 శాతం, 0.18 శాతం పెరిగాయి. గుడ్ల ధరలు 3.84 శాతం తగ్గగా, పండ్లు 6.41 శాతం ప్రియమయ్యాయి.
* రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు మే 4న 0.4 శాతం; జూన్‌ సమీక్షలో 0.5 శాతం, ఆగస్టులో 0.5 శాతం మేర రెపో రేటును ఆర్‌బీఐ పెంచిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని