Published : 13 Aug 2022 02:18 IST

లాభాల్లోకి బీడీఎల్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.731.56 కోట్ల ఆదాయాన్ని, రూ.39.85 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.  క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.156.19 కోట్ల ఆదాయంపై రూ.20.95 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.


జీవీకే పవర్‌ నష్టం రూ.400 కోట్లు

దిల్లీ: జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా జూన్‌ త్రైమాసికానికి రూ.400.08 కోట్ల ఏకీకృత నష్టాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసికంలో సంస్థ నష్టం రూ.74.92 కోట్లే కావడం గమనార్హం. ఇదే సమయంలో ఆదాయం మాత్రం రూ.73.21 కోట్ల నుంచి రూ.620.37 కోట్లకు పెరిగింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని