హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మాతృసంస్థ హెచ్‌డీఎఫ్‌సీల విలీన ప్రతిపాదనకు కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. తొలి దశ కింద హెచ్‌డీఎఫ్‌సీలో హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్‌లను విలీనం చేస్తారు. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేస్తారు. ‘రెండు దశల్లో జరిగే

Published : 14 Aug 2022 03:05 IST

విలీనానికి సీసీఐ ఆమోదం

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మాతృసంస్థ హెచ్‌డీఎఫ్‌సీల విలీన ప్రతిపాదనకు కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. తొలి దశ కింద హెచ్‌డీఎఫ్‌సీలో హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్‌లను విలీనం చేస్తారు. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేస్తారు. ‘రెండు దశల్లో జరిగే హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్‌ల ప్రతిపాదిత విలీనానికి’ ఆమోదం ఇచ్చినట్లు సీసీఐ ట్వీట్‌ చేసింది. ఈ విలీనాన్ని ఏప్రిల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక పరిమితికి మించిన ఒప్పందాలకు సీసీఐ అనుమతి అవసరం అన్న సంగతి తెలిసిందే. తద్వారా మార్కెట్లో పోటీపరంగా కంపెనీల మధ్య ఇబ్బందులు ఎదురుకాకుండా సీసీఐ చూస్తుంది.

ఏసీసీ, అంబుజా, అదానీ ఒప్పందానికీ..: అంబుజా సిమెంట్స్‌, ఏసీసీలలో హోల్సిమ్‌ వాటాను కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్‌నకు సీసీఐ ఆమోద ముద్ర వేసింది. ‘హోల్డరిండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీలలో వాటాను ఎండీవర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కొనుగోలు చేయడానికి ఆమోదం ఇస్తున్న’ట్లు పేర్కొంది. హోల్డరిండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 100 శాతం వాటాను ఎండీవర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కొనుగోలు చేసే ప్రతిపాదన సైతం ఇందులో ఉంది. మారిషస్‌కు చెందిన ఈ కంపెనీ పూర్తిగా అదానీ గ్రూప్‌ది కాగా; హోల్డర్‌ఫిన్‌ బీవీకి చెందిన హోల్డరిండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మాతృసంస్థ స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్‌ గ్రూప్‌ కావడం గమనార్హం. ఏసీసీ, అంబుజాల హోల్డింగ్‌ కంపెనీయే ఈ హోల్సిమ్‌. మే నెలలో ఈ ఒప్పందానికి సంబంధించి అదానీ గ్రూప్‌ ప్రకటన చేసిన విషయం విదితమే.

ఐఐఎఫ్‌ఎల్‌ హోమ్‌ వాటా కొనుగోలుకూ..

ఐఐఎఫ్‌ఎల్‌ హోమ్‌లో వాటాను పరోక్షంగా అబుదాభి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (ఏడీఐఏ) కొనుగోలు చేయడానికి అనుమతిస్తున్నట్లు సీసీఐ తెలిపింది. ఐఐఎఫ్‌ఎల్‌ హోమ్‌ ఫైనాన్స్‌లో 20 శాతం వాటాను ప్లాటినమ్‌ ఔల్‌ సీ 2018 ఆర్‌ఎస్‌సీ కొనుగోలు చేయాలన్నది ప్రతిపాదన. ప్లాటినమ్‌ జాస్మిన్‌ ట్రస్ట్‌ ఈ కంపెనీకి ఒక ట్రస్టీగా పనిచేస్తోంది. అయితే ఈ ట్రస్ట్‌కు ఏడీఐఏనే నేతృత్వం వహిస్తోంది. ఆ లెక్కన ఏడీఐఏ గ్రూప్‌ పరోక్షంగా ఐఐఎఫ్‌ఎల్‌ హోమ్‌లో వాటాను కొనుగోలు చేస్తుందన్నమాట.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని