ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓగా గోపాల్‌ విఠల్‌ పునర్నియామకం

భారతీ ఎయిర్‌టెల్‌ మేనేజింగ్‌ డైరెక్టరు (ఎండీ), సీఈఓగా గోపాల్‌ విఠల్‌ పునర్నియామక ప్రతిపాదనకు కంపెనీ వాటాదార్లు ఆమోదం తెలిపారు. 2023 ఫిబ్రవరి 1 నుంచి అయిదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. పునర్నియామక ప్రతిపాదనకు 97 శాతం మంది అనుకూలంగా ఓటేశారని వార్షిక సాధారణ సమావేశం వివరాలను ఎక్స్ఛేంజీలకు

Published : 14 Aug 2022 03:05 IST

వాటాదార్ల ఆమోదం

దిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ మేనేజింగ్‌ డైరెక్టరు (ఎండీ), సీఈఓగా గోపాల్‌ విఠల్‌ పునర్నియామక ప్రతిపాదనకు కంపెనీ వాటాదార్లు ఆమోదం తెలిపారు. 2023 ఫిబ్రవరి 1 నుంచి అయిదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. పునర్నియామక ప్రతిపాదనకు 97 శాతం మంది అనుకూలంగా ఓటేశారని వార్షిక సాధారణ సమావేశం వివరాలను ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తూ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఎండీ, సీఈఓగా గోపాల్‌ విఠల్‌కు చెల్లించే పారితోషికానికి సంబంధించిన ప్రత్యేక ప్రతిపాదనకూ వాటాదార్లు ఆమోదముద్ర వేశారు. ఈ ప్రతిపాదనకు 89.57 శాతం మంది అనుకూలంగా, 10.42 శాతం మంది వ్యతిరేకంగా ఓటేశారని పేర్కొంది. 2018 ఫిబ్రవరి 1న గోపాల్‌ విఠల్‌ను ఎండీ, సీఈఓగా అయిదేళ్ల కాలానికి కంపెనీ పునర్నియమించింది. తాజాగా ఆ సమయాన్ని మరో ఐదేళ్లు పొడిగించడంతో.. 2028 జనవరి 31 వరకు ఆయన ఈ పదవుల్లో కొనసాగనున్నారు. అలాగే వార్షికంగా రూ.9.6 కోట్ల స్థిర వేతనాన్ని పారితోషికంగా చెల్లించేందుకు ప్రతిపాదించారని ఏజీఎం అజెండాలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరన వేరియబుల్‌ పే (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు) కింద వార్షికంగా రూ.6.2 కోట్లు చెల్లించాలనీ అందులో ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వార్షిక స్థిర వేతనంలో 90 శాతానికి వేరియబుల్‌ పే మించకూడదని పేర్కొంది. 2021-22లో విఠల్‌కు స్థిర వేతనం రూ.9.1 కోట్లుగా ఉంది. ఇది కాకుండా వేరియబుల్‌ పే అదనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని