విమానాశ్రయాల్లో పక్షి ప్రమాదాల నివారణకు

దేశంలోని విమానాశ్రయాల్లో పక్షులు, ఇతర జంతువులను విమానాలు ఢీకొంటున్న సంఘటనల నేపథ్యంలో ఆ ప్రమాదాల నివారణకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా విమానాశ్రయాల్లో తరచుగా సాధారణ గస్తీని నిర్వహించడంతో పాటు వన్యప్రాణుల కార్యకలాపాలను గమనించినప్పుడు

Published : 14 Aug 2022 03:05 IST

డీజీసీఏ మార్గదర్శకాలు

దిల్లీ: దేశంలోని విమానాశ్రయాల్లో పక్షులు, ఇతర జంతువులను విమానాలు ఢీకొంటున్న సంఘటనల నేపథ్యంలో ఆ ప్రమాదాల నివారణకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా విమానాశ్రయాల్లో తరచుగా సాధారణ గస్తీని నిర్వహించడంతో పాటు వన్యప్రాణుల కార్యకలాపాలను గమనించినప్పుడు వెంటనే ఆ విషయాన్ని పైలట్లకు తెలియజేసే వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించింది.
* గత కొన్ని వారాల్లో పక్షుల్ని విమానాలు ఢీకొట్టిన సందర్భాలున్నాయి. ఈ నెల 4న గోఫస్ట్‌ విమానం అహ్మదాబాద్‌ నుంచి చండీగఢ్‌కు వెళ్లాల్సి ఉండగా, పక్షిని ఢీకొట్టడంతో తిరిగి అహ్మదాబాద్‌లోనే ల్యాండ్‌ అయ్యింది.

* గత జూన్‌ 19న పట్నా విమానాశ్రయం నుంచి 185 మంది ప్రయాణికులతో బయల్దేరిన స్పైస్‌జెట్‌ విమానం ఇంజిన్‌లో తలెత్తిన సమస్య కారణంగా నిమిషాల వ్యవధిలోనే అత్యవరసంగా ల్యాండ్‌ అయ్యింది. పక్షిని ఢీకొట్టడంతోనే ఇంజిన్‌లో సమస్య తలెత్తినట్లు తర్వాత గుర్తించారు.

* ఇలాంటి సంఘటనల నేపథ్యంలో శనివారం అన్ని విమానాశ్రయ నిర్వాహకులకు డీజీసీఏ సర్క్యులర్‌ జారీ చేసింది. వైల్డ్‌లైఫ్‌ హజార్డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను సమీక్షించి, విమానాశ్రయాలు, దాని పరిసరాల్లో కచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

* వన్య ప్రాణుల కదలికల డేటాను సాధారణ గస్తీల ద్వారా గుర్తించి రికార్డు చేయాలని, పైలట్లకు సమాచారాన్ని చేరవేసే వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రతి నెలా 7న పక్షి ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలను తమకు తెలియజేయాలని డీజీసీఏ సర్క్యులర్‌లో కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని