కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ద్వారా జీఎస్‌టీ చెల్లింపులు

కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ (కేవీబీ) ద్వారా ఆ బ్యాంకు వినియోగదార్లు తమ జీఎస్‌టీ చెల్లింపులను చేసుకోవచ్చు. జీఎస్‌టీ చెల్లింపులను స్వీకరించే అధీకృత బ్యాంకుల్లో ఇప్పుడు కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ కూడా చేరింది. కేవీబీ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, శాఖల్లోని కౌంటర్‌ ద్వారా జీఎస్‌టీని చెల్లించవచ్చని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 14 Aug 2022 03:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ (కేవీబీ) ద్వారా ఆ బ్యాంకు వినియోగదార్లు తమ జీఎస్‌టీ చెల్లింపులను చేసుకోవచ్చు. జీఎస్‌టీ చెల్లింపులను స్వీకరించే అధీకృత బ్యాంకుల్లో ఇప్పుడు కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ కూడా చేరింది. కేవీబీ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, శాఖల్లోని కౌంటర్‌ ద్వారా జీఎస్‌టీని చెల్లించవచ్చని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పటికే పన్నుల వసూళ్లకు కేవీబీ అధీకృత బ్యాంకుగా ఉంది. ఆన్‌లైన్‌లో కస్టమ్స్‌ సుంకం చెల్లింపులనూ స్వీకరిస్తోంది. ‘జీఎస్‌టీ చెల్లింపులకు అవకాశం కల్పించడం ద్వారా మా వినియోగదార్ల దీర్ఘకాలిక అవసరాన్ని తీర్చగలిగాం. కరెంటు ఖాతాలను మరిన్ని పెంచుకునేందుకు, కాసా నిల్వలనూ బలోపేతం చేసుకునేందుకు ఈ పరిణామం ఉపయోగపడుతుంద’ని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ బి.రమేశ్‌ బాబు  తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు