రిలయన్స్‌ డిజిటల్‌ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌ సేల్‌

రిలయన్స్‌ డిజిటల్‌ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 16 వరకు ప్రముఖ బ్యాంకుల కార్డులపై 10% తక్షణ డిస్కౌంట్‌ను ఇస్తోంది. తదుపరి కొనుగోలుపై రీడీమ్‌ చేసుకునేలా 10% తక్షణ డిస్కౌంట్‌ ఓచర్లను సైతం ఇస్తోంది. వీటితో పాటు పలు ఫైనాన్స్‌

Published : 14 Aug 2022 03:05 IST

హైదరాబాద్‌: రిలయన్స్‌ డిజిటల్‌ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 16 వరకు ప్రముఖ బ్యాంకుల కార్డులపై 10% తక్షణ డిస్కౌంట్‌ను ఇస్తోంది. తదుపరి కొనుగోలుపై రీడీమ్‌ చేసుకునేలా 10% తక్షణ డిస్కౌంట్‌ ఓచర్లను సైతం ఇస్తోంది. వీటితో పాటు పలు ఫైనాన్స్‌ ఆప్షన్లనూ పొందొచ్చని చెబుతోంది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణాలు, వంట సామగ్రి.. ఇలా అన్నిటి కోసం రిలయన్స్‌ డిజిటల్‌, మై జియో స్టోర్లతో పాటు www.reliancedigital.in ను సందర్శించవచ్చని తెలిపింది.

* 65 అంగుళాల యూహెచ్‌డీ యాండ్రాయిడ్‌ టీవీలను రూ.49,900 ప్రారంభ ధర నుంచి; 43 అంగుళాల యూహెచ్‌డీ యాండ్రాయిడ్‌ టీవీలను రూ.19,990 ప్రారంభ ధర నుంచి పొందొచ్చని పేర్కొంది.

* ల్యాప్‌టాప్‌లు, యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌, ఐఫోన్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా తదితరాలకూ ప్రత్యేక ధరలను ప్రకటించింది. ఫ్రంట్‌ లోడింగ్‌ వాషింగ్‌ మెషీన్‌ రూ.18,990; సరికొత్త మైక్రోఓవెన్లు రూ.6490 నుంచి లభ్యమవుతాయి. ఎయిర్‌కండిషనర్లు, ఇతరాలపై 60% వరకు ఆఫ్‌-సీజన్‌ డిస్కౌంట్లు ఇస్తోంది. ఇవన్నీ కాకుండా.. షాపర్లందరికీ బహుమతులు లభిస్తాయి. లక్కీ విజేతలకు కార్లు, బైకులు, టీవీలు, ఫోన్లను గెలుచుకునే అవకాశమూ ఉందని ఆ ప్రకటనలో వెల్లడించింది.


సంక్షిప్తంగా

*  ఇన్ఫోఎడ్జ్‌ తన అనుబంధ సంస్థ స్టార్టప్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రూ.300 కోట్ల పెట్టుబడులను పెట్టింది.  

* పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ డైరెక్టరుగా ఆర్‌.కె.త్యాగి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో 2026, మార్చి 31 వరకు లేదంటే తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు కొనసాగుతారు.

* రష్యా చమురు దిగ్గజం రోస్‌నెఫ్ట్‌ పెట్టుబడులున్న నయారా ఎనర్జీ ఏప్రిల్‌-జూన్‌లో రికార్డు స్థాయిలో రూ.3,564 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురును ఎగుమతి చేసుకోవడం ఇందుకు ఉపకరించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts