పెరిగిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

ఆర్‌బీఐ రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో.. వెంటనే రెపో ఆధారిత రుణ వడ్డీ రేట్ల (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను పెంచిన బ్యాంకులు.. ఇప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీని పెంచడం ప్రారంభించాయి.

Published : 14 Aug 2022 03:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్‌బీఐ రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో.. వెంటనే రెపో ఆధారిత రుణ వడ్డీ రేట్ల (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను పెంచిన బ్యాంకులు.. ఇప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీని పెంచడం ప్రారంభించాయి.

* ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన రూ.2కోట్ల లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లను 15 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచింది. 1-2 ఏళ్ల మధ్య కాల వ్యవధి డిపాజిట్లపై 5.50 శాతం, 3-5 ఏళ్లకు 5.60శాతం, 5-10 ఏళ్లకు 5.65 శాతం వడ్డీనిస్తున్నట్లు ప్రకటించింది. సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 0.50శాతం వర్తిస్తుంది. అయిదేళ్ల ‘ఎస్‌బీఐ వుయ్‌కేర్‌’ ప్రత్యేక డిపాజిట్‌ పథకాన్ని సెప్టెంబరు 30 వరకూ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ పథకంలో సీనియర్‌ సిటిజన్లకు అదనంగా మరో 30 బేసిస్‌ పాయింట్ల మేరకు వడ్డీ లభిస్తుంది.

* సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1-2 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 5.35 శాతం, 2-3 ఏళ్ల వ్యవధికి 5.40శాతం, 3-5 ఏళ్ల డిపాజిట్లపై 5.40శాతం, 5-10 ఏళ్ల ఎఫ్‌డీపై 5.60 శాతం, 555 రోజుల టర్మ్‌ డిపాజిట్‌పై 5.55 శాతం వడ్డీనిస్తున్నట్లు ప్రకటించింది.

* ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) ఏడాది నుంచి 2 ఏళ్లలోపు డిపాజిట్లపై 5.45శాతం, 444 రోజుల వ్యవధి ఎఫ్‌డీలపై 5.60 శాతం, మూడేళ్లు అంతకు మించి వ్యవధికి 5.70 శాతం వడ్డీనిస్తున్నట్ల వెల్లడించింది.

* యాక్సిస్‌ బ్యాంక్‌ 13-17 నెలల వ్యవధి డిపాజిట్లపై 5.60 శాతం, 17-18 నెలల డిపాజిట్లపై 6.05శాతం వరకూ వడ్డీనిస్తోంది. 3-5 ఏళ్ల డిపాజిట్లపై 5.70 శాతం ప్రకటించింది.

* కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ 1-2 ఏళ్ల డిపాజిట్‌పై 5.75శాతం, 2-3 ఏళ్ల వ్యవధికి 5.85 శాతం, మూడేళ్లు ఆ పైన వ్యవధి డిపాజిట్లపై 6 శాతం వడ్డీని ఇస్తున్నట్లు తెలిపింది. పెంచిన వడ్డీ రేట్లు ఈ నెల 16 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. బ్యాంకులన్నీ 60 ఏళ్లు దాటిన వారి డిపాజిట్లపై 0.50 శాతం వడ్డీని అదనంగా ఇస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని